Kalki 2898 AD: 'చూసుకోవాలి కదా అమ్మా' అంటూ దీపికా పదుకొణె డబ్బింగ్ పై ట్రోల్స్

ABN , Publish Date - Jun 11 , 2024 | 04:33 PM

ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'కల్కి 2898 ఏడి' ట్రైలర్ విడుదలైంది. నాగ్ అశ్విన్ దర్శకుడిగా లెజండరీ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇంకా హిందీ నటీమణులు దీపికా పదుకొణె, దిశా పఠాని నటిస్తున్న ఈ సినిమా జూన్ 27న విడుదలవుతోంది. విడుదలైన ట్రైలర్ లో దీపికా పదుకొణె డబ్బింగ్ గురించి నెటిజన్స్ ఏమన్నారు అంటే...

Kalki 2898 AD: 'చూసుకోవాలి కదా అమ్మా' అంటూ దీపికా పదుకొణె డబ్బింగ్ పై ట్రోల్స్
Kalki 2898 AD trailer is out

అందరూ ఎదురు చూస్తున్న 'కల్కి 2898 ఏడి' సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. ప్రభాస్ కథానాయకుడిగా వస్తున్న ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకుడు. ఈ సినిమా జూన్ 27న విడుదలవుతోంది. ఇంకా ఈ సినిమాలో హిందీ నటీనటులు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పఠాని తో పాటుగా కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్ ఇలా చాలామంది వున్నారు. నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ లో వుంది.

Deepika.jpg

అయితే ఈ సినిమా ట్రైలర్ మరీ ప్రేక్షకులు ఊహించినంతగా లేకపోయినా, పరవాలేదు అని అంటున్నారు. మిగతావి ఎలా వున్నా, నెటిజన్స్ మాత్రం దీపికా పదుకొణె తెలుగు డబ్బింగ్ ని మాత్రం బాగా ట్రోల్ చేస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ డబ్బింగ్ విషయంలో కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది అని కూడా అంటున్నారు. (Netizens trolling Deepika Padukone Telugu dubbing from the Kalki 2898 AD film trailer)

ఎందుకంటే ఈ సినిమాలో తెలుగు నటీనటులకన్నా మిగతా భాషా నటులే ఎక్కువ, అందుకని వాళ్ళకి డబ్బింగ్ సరిగ్గా లేదు అని అంటున్నారు నెటిజన్స్. తెలుగు డబ్బింగ్ ఆర్టిస్టులతో కాకుండా, వేరే వాళ్ళతో చెప్పించినట్టుగా కనపడుతోంది. ఏమైనా కూడా డబ్బింగ్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఈ విమర్శలు వచ్చేవి కాదని అంటున్నారు. ముఖ్యంగా దీపికా పదుకొణె తెలుగు డబ్బింగ్ విషయంలో అయితే ఈ ట్రోల్స్ ఎక్కువయ్యాయి.

Kalki.jpg

ఆమె ఇంతకు ముందు ఒక తెలుగు సినిమా చేసింది, కానీ ఆ సినిమా విడుదలవలేదు. దీపిక దక్షిణాదికి చెందిన నటి అయినా, హిందీలో ఎక్కువగా చెయ్యడంతో ఆమె తెలుగు అంతంత మాత్రంగానే ఉండటంతో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్, నయనతార నటించిన సినిమాలోని ఒక సన్నివేశం పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియోలో ప్రభాస్ ఒక వుత్తరం రాస్తూ ఉంటే, అది వెనకాల నుంచి నయనతార వచ్చీ రాని తెలుగులో చదవటం ఉంటుంది.

అక్షయ్ కుమార్ నటించిన 'హౌస్ ఫుల్' హిందీ సినిమాలో అక్కడక్కడా కొన్ని తెలుగు మాటలు వినపడతాయి. అందులో దీపిక కూడా కొన్ని మాటలు మాట్లాడుతుంది. 'అన్నా' అంటూ వచ్చి అర్జున్ రాంపాల్ ని హగ్ చేసుకునే సన్నివేశం కూడా వుంది. ఆమెకి సమాధానంగా అర్జున్ రాంపాల్ 'బాగున్నావా చిన్నా' అనటం, దానికి మళ్ళీ దీపిక 'చాలా బాగున్నాను' అని తెలుగులో అనటం, ఈ వీడియోని ట్రోల్స్ కి వాడుతున్నారు నెటిజన్స్.

Updated Date - Jun 11 , 2024 | 04:34 PM