Niharika Nm: సెలబ్రిటీలే నా ఫాలోవర్స్.. అతనే నా లక్కీ ఛార్మ్
ABN, Publish Date - Jul 21 , 2024 | 10:00 AM
సినిమాల్లో ప్రవేశానికి సోషల్‌మీడియా షార్ట్‌కట్‌గా మారింది. నిహారిక ఎన్‌ఎమ్ విషయంలో కూడా అదే జరిగింది. సోషల్‌మీడియాలో ఈ చెన్నై బ్యూటీ చేసిన వీడియోలకు కోట్లలో వ్యూస్, లక్షల్లో లైక్స్... అందుకే సినిమా స్టార్స్ సైతం ఈమెతో రీల్స్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
సినిమాల్లో ప్రవేశానికి సోషల్‌మీడియా షార్ట్‌కట్‌గా మారింది. నిహారిక ఎన్‌ఎమ్ (NIharika NM)విషయంలో కూడా అదే జరిగింది. సోషల్‌మీడియాలో ఈ చెన్నై బ్యూటీ చేసిన వీడియోలకు కోట్లలో వ్యూస్, లక్షల్లో లైక్స్... అందుకే సినిమా స్టార్స్ సైతం ఈమెతో రీల్స్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదే క్రేజ్‌తో (Celebrity crush) ఆమె టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ‘కామెడీ క్వీన్’ తన గురించి చెబుతున్న ముచ్చట్లివి...
అలా మొదలైంది... (influencer)
నేను పుట్టింది చెన్నైలోనైనా, పెరిగిందంతా బెంగళూరులో. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఎంబీఏ కోసం యూఎస్ వెళ్లాను. లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకోవడంతో కాలక్షేపానికి లఘు వీడియోలు చేయడం మొదలుపెట్టాను. అన్నీ జస్ట్ ఫన్నీ వీడియోలే. మొదట సామాన్యులు... ఆ తర్వాత సెలబ్రిటీలు ఫాలోవర్స్‌గా మారారు. ఎప్పుడైతే సెలబ్రిటీలతో వీడియోలు చేయడం మొదలెట్టానో, అప్పటి నుంచి అనూహ్యంగా ఫాలోవర్స్ పెరిగారు. కేవలం రెండు నెలల వ్యవధిలో వీరి సంఖ్య కోట్లకు చేరింది.
అతనే నా క్రష్(Yash is crush)
నా ఆల్ టైం ఫేవరెట్ హీరో.. మహేష్ బాబు. ఆయన పేరులో ఏదో వైబ్రేషన్ ఉంటుంది. ఆయనతో ‘సర్కారువారి పాట’, ‘మేజర్’ ప్రమోషన్స్ చేశాను. మొదటిసారి ఆయనతో మాట్లాడడానికి కాస్త తడబడ్డాను. నిజానికి మహేష్ చాలా స్వీట్ పర్సన్. నా ఇన్‌స్టాగ్రామ్ క్రష్ అయితే.. విజయ్ దేవరకొండ.
అందరి ఫేవరెట్‌ని!(Movie Promotions)
నేను ఎంతోమంది సెలబ్రిటీల హాట్ ఫేవరెట్‌ని. నా ఇన్‌స్టా ఖాతాను ఫాలో అయ్యేవారిలో సమంత, లక్ష్మీ మంచు, నాగచైతన్య, తమన్నా, వర్ష బొల్లమ్మ, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా వంటి స్టార్స్ సైతం ఉన్నారు. నా పేరులో ఉన్న ఎన్.ఎమ్. అంటే.. ‘నథింగ్ మచ్’ అని అర్థం. నేను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలను.
స్టార్స్‌తో రీల్స్
యశ్ నా లక్కీ ఛార్మ్ అని చెప్పాలి. నేను కలిసి పనిచేసిన మొదటి నటుడు అతడే. ‘కెజీఎఫ్’ ఛాప్టర్-2 ప్రమోషన్‌లో భాగంగా ఆయనతో కలిసి పనిచేశాను. ఆ ప్రచార వీడియో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆపై వరుసగా స్టార్స్ అందరూ వాళ్ల సినిమాల ప్రమోషన్స్ కోసం నన్ను సంప్రదించడం మొదలెట్టారు. అలా ఇప్పటిదాకా ప్రియాంక చోప్రా, రణబీర్‌కపూర్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, విక్రమ్, అజయ్‌దేవగణ్ వంటి సెలబ్రిటీలతో కలిసి హంగామా చేశా. ముఖ్యంగా గతేడాది క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో చేసిన వీడియో తెగ వైరలైంది.
అవార్డులకు లెక్కే లేదు...
ప్రతిష్ఠాత్మక ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ వేదికగా ‘యూత్ ఐకాన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్ 2022’ అవార్డు అందుకున్నా. ‘ఇంపాక్ట్ డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్ అవార్డ్- 2021’, ‘బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇన్‌ఫ్లుయెన్సర్’, ‘ఉమెన్ డిస్‌రప్టర్స్’, ‘బ్లాగర్/క్రియేటర్ ఆఫ్ ది ఇయర్’ సహా పలు అవార్డులు వరించాయి. ‘క్రియేటర్స్ ఫర్ చేంజ్’, ‘యూట్యూబ్ ఇనీషియేటివ్’ వంటి అవార్డులకు ఎంపికైన ఏకైక భారతీయురాలిని నేనే. 2022 ఫోర్బ్స్ ‘30 అండర్ 30’లోనూ స్థానం సంపాదించుకున్నా.
గూగుల్ ఆఫర్ వద్దనుకున్నా...
అందరిలాగే ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం సంపాదించాలని కలలు కనేదాన్ని. అందుకు తగ్గట్టు చాలా కష్టపడ్డాను. అనుకున్నట్టుగానే గూగుల్ నుంచి ఆఫర్ వచ్చింది. కానీ చివరి నిమిషంలో నా ఆలోచన మారింది. పదిమందిలో ఒకరిలా కాకుండా... నన్ను నేను ఒక బ్రాండ్‌గా మలుచుకోవాలనుకున్నా. అందుకే సున్నితంగా ఆ ఆఫర్ తిరస్కరించా.