Chiranjeevi - Modi: తమ్ముడి స్వాగతోత్సవంలాగే మోదీజీతో సంభాషణ కూడా కలకాలం గుర్తుండి పోతుంది!
ABN, Publish Date - Jun 13 , 2024 | 10:14 AM
ముఖ్యమంత్రి, ముంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra modi)అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పవన్ కల్యాణ్‌తో కలిసి వేదికపై కుడివైపు ఉన్న చిరంజీవి చెంతకు స్వయంగా వెళ్లారు. అక్కడ చిరు, పవన్ లతో కలిసి అభివాదం చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) ప్రమాణ స్వీకారం అభిమానులు, కార్యకర్తల నడుమ ఎంతో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే! ముఖ్యమంత్రి, ముంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra modi)అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పవన్ కల్యాణ్‌తో కలిసి వేదికపై కుడివైపు ఉన్న చిరంజీవి చెంతకు స్వయంగా వెళ్లారు. అక్కడ చిరు, పవన్ లతో కలిసి అభివాదం చేశారు. ఆ క్షణంలో చిరంజీవితో కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. ఆ వీడియోలో ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే! పిక్ ఆఫ్ ద డే అని, అద్భుతమైన విజువల్ అని సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోయింది. అభిమానులు అయితే ఆ వీడియో, ఫొటోలను స్టేటస్‌లుగా పెట్టుకున్నారు. అయితే వేదికపై చిరంజీవితో మోదీ అంతగా ఏం మాట్లాడారు అనే చర్చ నిన్నటి నుంచీ జరుగతోంది. ఈ విషయంపై చిరంజీవి బుధవారం రాత్రి ట్వీట్ చేశారు. మోదీ ఏం మాట్లాడారో తెలిపారు.
"ప్రమాణ స్వీకారం వేదికగా ప్రధాని నరేంద్ర మోదీగారు, తమ్ముడు పవన్ కళ్యాణ్ (pawan kalyan) తోనూ, నాతోనూ వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడటం ఎంతో ఆనందంగా అనిపించింది. ‘ఎన్నికల ఫలితాల తరువాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పటి వీడియో ఆయన చూసారనీ, అది ఎంతో భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు. కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమానుబంధాలను పంచుకున్న ఆ దృశ్యాలు, మన సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని, ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆదర్శంగా నిలుస్తాయి’ అని అనడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. వారి సునిశిత దృష్టికి, నా కృతజ్ఞతలు. నా తమ్ముడి స్వాగతోత్సవం లాగే ఆయనతో ఈనాటి మా సంభాషణ కూడా కలకాలం గుర్తు ఉండిపోయే ఓ అపురూప జ్ఞాపకం’’ అని చిరంజీవి భావోద్వేగంతో పోస్ట్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. (Chiranjeevi tweet viral)