Chiru- Balayya: చిరుని ఆప్యాయంగా పిలిచిన బాలయ్య.. మాటిచ్చేసిన చిరు!

ABN, Publish Date - Aug 24 , 2024 | 07:15 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మంచి స్నేహితులనే విషయం ఎన్నో సందర్భాలలో నిరూపించారు. కానీ వారి అభిమానులు మాత్రం.. ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటారు. మా ఇద్దరి మధ్య సోదరబంధం ఉందని పలుమార్లు చాటిన ఈ ఇద్దరూ.. మరోసారి అది విషయాన్ని చాటి చెప్పారు. తాజాగా వారిద్దరూ ఓ వివాహ వేడుకకు హాజరై.. ఇలా ఆప్యాయంగా పలకరించుకున్నారు.

Chiranjeevi and Balakrishna

తెలుగు సినిమా ఇండస్ట్రీ (Tollywood)కి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మంచి స్నేహితులనే విషయం ఎన్నో సందర్భాలలో నిరూపించారు. కానీ వారి అభిమానులు మాత్రం.. ఎప్పుడూ పోట్లాడుకుంటూ.. ఒకరికంటే ఇంకొకరు ఎక్కువ అనేలా కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. కానీ చిరంజీవి, బాలకృష్ణలు మాత్రం.. అది కేవలం సినిమాల వరకు మాత్రమే కానీ.. మా మధ్య సోదరబంధం ఉందనేలా చాటుతూ వస్తున్నారు. ఇప్పుడూ మరోసారి ఇదే విషయాన్ని వారు స్పష్టం చేశారు. శుక్రవారం పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పెద్ద కుమారుడి వివాహా రిసెప్షన్‌కు (Ramajogaiah Sastry Son Marriage Reception) చిరు, బాలయ్య హాజరై ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read- Indra Movie: ఈ కానుక అమూల్యం.. ఈ జ్ఞాపకం అపురూపం


ముందుగా నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం.. మెగాస్టార్ చిరంజీవి (Chiru) తిరిగి వెళ్లిపోతున్న క్రమంలో ఆయనను సోదరా.. అని ఆప్యాయంగా పిలిచి కాసేపు ముచ్చటించారు బాలయ్య. వారిద్దరి మధ్య సంభాషణలో బాలయ్య తన అన్ స్టాపబుల్ షో‌కి గెస్ట్‌గా రావాలని చిరంజీవిని అడిగేశారని.. అందుకు వెంటనే చిరంజీవి కూడా కచ్చితంగా వస్తానని బాలయ్యకు మాటిచ్చేశారని తెలుస్తోంది. అలాగే త్వరలో జరగనున్న నటుడిగా బాలయ్య స్వర్ణోత్సవ వేడుకకు సంబంధించి కూడా వీరిద్దరి మధ్య సంభాషణ జరిగినట్లుగా టాక్ వినబడుతోంది. (Chiranjeevi and Balakrishna)


ఇక వీరిద్దరిని ఇలా చూసి.. అక్కడున్న వారే కాకుండా.. వారి అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. దశాబ్దాలుగా ప్రొషెషనల్‌గా పోటీపడ్డ హీరోలు వీరు. ఒకేసారి వీరిద్దరి సినిమాలు రిలీజ్ అయితే అభిమానుల మధ్య ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చిరంజీవి వర్సెస్ బాలయ్య అంటూ రకరకాల కథనాలు, ఊహాగానాలు ఇప్పటి వరకు ఎన్నో వచ్చాయి. కానీ వాటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ.. రామజోగయ్య శాస్త్రి కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకగా చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఓ స్నేహపూర్వక సందర్భం వెలుగు చూసింది. త్వరలో నటుడిగా స్వర్ణోత్సవ వేడుకను జరపుకోబోతున్న బాలయ్య (Balayya) వేడుకకు మెగాస్టార్ చిరంజీవి విశిష్ట అతిథిగా హాజరవబోతోన్న విషయం విదితమే.

Read Latest Cinema News

Updated Date - Aug 24 , 2024 | 08:33 PM