Gaami: ఆసక్తికరంగా ‘గామి’ క్యారెక్టర్స్ టీజర్.. విశ్వక్ సేన్‌కే సమస్య!
ABN, Publish Date - Feb 17 , 2024 | 10:45 PM
మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడుతున్న అఘోరా పాత్రలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌ని ప్రజెంట్ చేయాలనే బేసిక్ ఐడియా అప్ కమింగ్ మూవీ ‘గామి’పై ఆసక్తిని పెంచుతోంది. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించారు. ఈ అడ్వెంచర్ డ్రామాకు క్రౌడ్ ఫండ్ చేయగా.. వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. తాజాగా ఈ చిత్ర క్యారెక్టర్ టీజర్‌ని మేకర్స్ వదిలారు.
మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడుతున్న అఘోరా పాత్రలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Mass ka das Vishwak Sen)ని ప్రజెంట్ చేయాలనే బేసిక్ ఐడియా అప్ కమింగ్ మూవీ ‘గామి’పై ఆసక్తిని పెంచుతోంది. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించారు. ఈ అడ్వెంచర్ డ్రామాకు క్రౌడ్ ఫండ్ చేయగా.. వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియో ఇతర ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ఆసక్తిని రేకెత్తించగా.. తాజాగా ‘గామి’ ప్రధాన పాత్రలను పరిచయం చేయడానికి మేకర్స్ ఒక చిన్న టీజర్ (Characters Of Gaami Teaser) వదిలారు.
ఈ టీజర్‌లో.. విశ్వక్ సేన్ తన సమస్యకు నివారణను చెప్పే వాయిస్ ఓవర్‌తో వీడియో ప్రారంభమైంది. ఎంజీ అభినయ, చాందిని చౌదరి, ఇతర ముఖ్యమైన పాత్రలు ఒకదాని తర్వాత మరొకటి పరిచయం చేయబడుతూ.. చివరగా, విశ్వక్‌ని.. శంకర్ అనే అఘోరాగా పరిచయం చేశారు. ‘ఇవన్నీ దాటుకొని నా వల్ల అవుతుందంటారా?’ అని విశ్వక్ చెప్పడం ఆసక్తిగా వుంది. చివరి విజువల్స్‌లో విశ్వక్, చాందిని హిమాలయ పర్వతాలను ట్రెక్కింగ్ చేస్తున్నట్లు చూపించారు. (Gaami Teaser)
ఈ టీజర్‌లోని పాత్రలు చాలా ఎక్సయిటింగ్‌గా ఉండటమే కాకుండా.. ఓ కొత్త తరహా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఫీల్‌ని ఇస్తున్నాయి. ఈ టీజర్‌లో ఫిబ్రవరి 29న థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. ట్రైలర్‌తో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరగడం ఖాయం. ఈ సినిమాను మార్చి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Aa Okkati Adakku: తండ్రి సినిమా టైటిల్‌కు ఫిక్సయిన అల్లరి నరేష్.. గ్లింప్స్ అదిరింది
**************************
*Vijay Deverakonda: ఫోర్బ్స్ లిస్ట్‌లో రష్మికకు చోటు.. విజయ్ స్పందనిదే..
****************************