మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Celebrity Splits and Divorces: మూణ్ణాళ్ళ ముచ్చటగా సెలెబ్రిటీల ప్రేమ వివాహాలు

ABN, Publish Date - May 19 , 2024 | 05:23 PM

తమిళ చిత్రపరిశ్రమలో ప్రేమ వివాహాలు మూణ్ణాళ్ళ ముచ్చటగా మారిపోతున్నాయి. ఎన్నో సంవత్సరాలు పాటు ప్రేమించుకుని, ఒకరినొకరు అర్థం చేసుకుని మూడుముళ్ళ బంధంతో ఒక్కటైన ప్రేమ జంటలు ఒక్కొక్కరుగా విడిపోతున్నారు. చిత్రపరిశ్రమలో ఆదర్శ దంపతులుగా గుర్తింపుపొందిన వారు సైతం తమ వైవాహిక బంధాన్ని తెగదెంపులు చేసుకుంటున్నారు. ఈ సెలెబ్రిటీల విడాకుల అంశం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.

Kollywood Celebrities

తమిళ చిత్రపరిశ్రమలో (Kollywood) ప్రేమ వివాహాలు మూణ్ణాళ్ళ ముచ్చటగా మారిపోతున్నాయి. ఎన్నో సంవత్సరాలు పాటు ప్రేమించుకుని, ఒకరినొకరు అర్థం చేసుకుని మూడుముళ్ళ బంధంతో ఒక్కటైన ప్రేమ జంటలు ఒక్కొక్కరుగా విడిపోతున్నారు. చిత్రపరిశ్రమలో ఆదర్శ దంపతులుగా గుర్తింపుపొందిన వారు సైతం తమ వైవాహిక బంధాన్ని తెగదెంపులు చేసుకుంటున్నారు. ఈ సెలెబ్రిటీల విడాకుల అంశం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. (Celebrity Splits and Divorces)

2002లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ధనుష్‌ (Dhanush), సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్య (Aishwarya) 2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దాదాపు 18 యేళ్ళు కలిసి జీవించారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నప్పటికీ వీరిద్దరూ విడిపోయారు. చట్టపరంగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.

*Kalki 2898AD Bujji: భైరవుడి ‘బుజ్జి’ ఎవరో తెలిసిపోయింది.. అరుపులే!

అదేవిధంగా తాను దర్శకత్వం వహించిన ‘దైవతిరుమగన్‌’, ‘తలైవా’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన మలయాళ నటి అమలాపాల్‌ (Amala Paul)ను డైరెక్టెర్‌ ఏఎల్‌ విజయ్‌ (AL Vijay) ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమ పెళ్ళి బంధం మూడేళ్ళకే ముగిసిపోయింది.

తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు, సినీ హీరో జీవీ ప్రకాష్‌ కుమార్‌ (GV Prakash Kumar), గాయని సైంధవి (Saindhavi) దంపతులు విడిపోయారు. 11 యేళ్ళ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్టు తాజాగా ప్రకటించారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. అయినప్పటికీ విడాకులకే మొగ్గుచూపారు.


అదేవిధంగా కోలీవుడ్‌లో కమల్‌ హాసన్‌ (Kamal Haasan) - వాణి గణపతి, కమల్‌ హాసన్‌ - సారిక, శరత్‌ కుమార్‌ - సాయా, ప్రతాప్‌ మోహన్‌ - రాధికా, రఘువరన్‌ - రోహిణి, ప్రశాంత్‌ - గృహలక్ష్మి, పార్తిబన్‌ - సీత, రామరాజన్‌ - నళిని, అరవింద్‌ స్వామి - గాయత్రి, ప్రకాష్‌ రాజ్‌ - లలిత కుమారి, ప్రభుదేవా - రమలత, సెల్వరాఘవన్‌ - సోనియా అగర్వాల్‌, మనోజ్‌ కె. జైన్‌ - ఊర్వశి, సరిత - ముకేష్‌, రేవతి - సురేష్‌ మేనన్‌, గౌతమి - సందీప్‌ పాండ్యన్‌, సిద్ధార్ధ్‌ - మేఘ్న, విష్ణు విశాల్‌ - రజినీ, ఇమాన్‌ - మోనికా ఇలా చెప్పుకుంటూ పోతే విడిపోయిన సెలెబ్రిటీల జాబితా చాలా పెద్దదిగానే ఉంది.

Read Latest Cinema News

Updated Date - May 19 , 2024 | 05:23 PM