Allu Arjun: అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?

ABN , Publish Date - May 11 , 2024 | 09:40 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ పై కేసు నమోదైంది. అల్లు అర్జున్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఆయనపై నంద్యాల టూటౌన్ పీఎస్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నంద్యాల నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా వేలాది మందితో ర్యాలీలో పాల్గొన్నారని పలువురు ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Allu Arjun: అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?
Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Icon Star Allu Arjun) పై కేసు నమోదైంది. అల్లు అర్జున్ ఎన్నికల కోడ్ (Election Code) ఉల్లంఘించిన నేపథ్యంలో ఆయనపై నంద్యాల టూటౌన్ పీఎస్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నంద్యాల (Nandyal) నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా వేలాది మందితో ర్యాలీలో పాల్గొన్నారని పలువురు ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

*AP Elections 2024: పవన్ కళ్యాణ్‌కు పెరుగుతున్న మద్దతు.. సోషల్ మీడియాలో సెలబ్రిటీల ట్వీట్స్

ఎన్నికల కోడ్ 31 ఏపీ యాక్ట్ 144 సెక్షన్ అమలులో ఉన్నందున నంద్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పర్మిషన్ లేకుండా వేలాదిమందిగా గుమికూడటం నేరమని.. స్పెషల్ డిప్యూటీ తాసిల్దార్ ఫిర్యాదు మేరకు నంద్యాల టూ టౌన్ పిఎస్‌లో వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి (Shilpa Ravi Chandra Kishore Reddy), అల్లు అర్జున్‌ (Allu Arjun)లపై కేసు నమోదు చేశారు.


Bunny.jpg

నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి‌కి మద్దతు తెలిపే నిమిత్తం శనివారం అల్లు అర్జున్ ఆయన నివాసానికి వెళ్లగా.. బన్నీని చూసేందుకు అభిమానులు, ప్రజలు వేలాదిగా తరలి వచ్చారు. అలా ప్రజలంతా రోడ్లపైకి రావడంతో స్థానికులు ఇబ్బందిపడినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు చేయగా.. క్రైమ్ నెంబర్ 71/2024గా కేసు రిజిస్టర్ అయినట్లు సమాచారం.

Read Latest Cinema News

Updated Date - May 11 , 2024 | 09:50 PM