మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Brahmanandam: బ్రహ్మానందం పుట్టిన‌రోజు.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న అనంత శ్రీరామ్ పాట

ABN, Publish Date - Feb 01 , 2024 | 05:12 PM

నేడు (ఫిబ్రవరి1) హస్య బ్రహ్మ బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా అనంత శ్రీరాం ర‌చించి పాడిన పాట‌ గూస్‌బంప్స్ తేచ్చే విధంగా ఉంది.

BRAHMANANDAM

నేడు (ఫిబ్రవరి1) హస్య బ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam) పుట్టినరోజు. 68వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వెళ్లువ జరుగుతోంది. అన్నిరంగాల ప్రముఖులు,సెటబ్రెటీలు బ్రహ్మానందంతో తమ అనుభవాలను పంచుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే మరొకరు చెప్పనవసరం లేకుండానే రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు తమ అభిమాన కమెడియన్ బర్త్ డేను ఓ దండయాత్రలా జరుపుతున్నారు. తమకు నచ్చిన బ్రహ్మనందం మీమ్స్ షేర్ చేస్తు,వీడియోలు పెడుతూ వీరంగమే చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. #Memegod

ఇప్పటివరకు 1100 కుపైగా చిత్రాలలో నటించి అందరి మోములో నవ్వులు పూయించి లేచినా,పడుకున్నా, హస్పటల్లో ఉన్నా ఇలా తెలుగు ప్రజల దైనందిన జీవితంలో ప్రతి సందర్భంలో భాగమైన ఒకేఒక వ్యక్తి మన బ్రహ్మానందం. ముఖ్యంగా నేటి యాంత్రిక జీవితంలో అయనే మెయిన్ మెడిసన్ .ఆయన లేకుంటే సోషల్ మీడియా , మీమ్స్ క్రియేటర్లు ఏమయ్యేవారో కూడా ఊహించలేం. అందుకనే ప్రస్తుత తరం బ్రహ్మానందం గాడ్ ఆఫ్ మీమ్స్, జిఫ్ గాడ్ (#HappyBirthdayMemeGod) అంటూ బిరుదులు ఇచ్చేశారు కూడా.


ప్ర‌స్తుతం బ్రహ్మానందం సినిమాలు త‌గ్గించిన‌ప్ఫ‌టికీ మ‌న‌కు ఆయ‌న క‌నిపించ‌ని మాధ్య‌మం లేదు. ఇప్ఫ‌టివ‌ర‌కు ఆయ‌న న‌టించిన‌ సినిమాల్లోని సీన్స్, డైలాగ్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తోనే సోషల్ మీడియా నడుస్తోంది. ఆయన డైలాగ్ష్,ఎక్స్‌ప్రెషన్స్ చూడకుండా, వినకుండా, వాడకుండా ఒక్క ట్రోల్, మీమ్, జిఫ్ క్రియేట్ చేయడం చాలా కష్టం. అందుకే ఆయ‌న లేకుండా మ‌న దైనందిన జీవితం న‌డ‌వ‌దన్న‌ది. ఇంకా చాలామంది ఈ రోజును వ‌ర‌ల్డ్ మీమ్స్ డేగా ఫ్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. HappyBirthdayBrahmanandam

ఇదిలాఉండ‌గా ఈ రోజు బ్ర‌హ్యానందం జ‌న్మ‌వదినాన్ని పుర‌స్క‌రించుకుని సినీ గేయ ర‌చ‌యిత అనంత శ్రీరాం (Anantha sriram) త‌న ప్రత్యేక‌త‌ను మ‌రోసారి చాటాడు. ఆయ‌నే స్వ‌యంగా ఒ గేయాన్ని ర‌చించి ఓ పాట‌ను ఆయ‌నే బ్ర‌హ్మ‌నంద స‌మ‌క్షంలో పాడి త‌న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ పాట గూస్‌బంప్స్ తేచ్చే విధంగా ఉండ‌డంతో విన్న‌వారంతా అనంత శ్రీరామ్‌ను మెచ్చుకుంటూ ఆయ‌న పాడిన పాట‌ను సోష‌ల్‌మీడియాలో తెగ వైర‌ల్ చేస్తున్నారు. మీరు వినండి.

Updated Date - Feb 01 , 2024 | 05:12 PM