Biggboss 8: వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ.. టీఆర్‌పీ కోసమేనా..

ABN, Publish Date - Oct 07 , 2024 | 12:37 PM

గత ఏడు సీజన్లకంటే బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 8 (Biggboss8) ఎక్కువ మందిని ఆకర్షిస్తోందని  ప్రారంభమైన సమయంలో నిర్వాహకులు చెప్పారు.  టీఆర్‌పీ రేటింగ్‌ కూడా బాగుందనే టాక్‌ వినిపించింది.

గత ఏడు సీజన్లకంటే బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 8 (Biggboss8) ఎక్కువ మందిని ఆకర్షిస్తోందని  ప్రారంభమైన సమయంలో నిర్వాహకులు చెప్పారు.  టీఆర్‌పీ రేటింగ్‌ కూడా బాగుందనే టాక్‌ వినిపించింది. అయితే తాజాగా షో బోరింగ్‌గా మారిందని, కంటెస్టెంట్లు ఆసక్తికరంగా ఆట ఆడట్లేదని కూడా  టాక్  వినిపిస్తోంది. పైగా ఈ సీజన్లో  ఇంటి సభ్యులు ఎవఋ కూడా అంతగా పాపులర్  అయినవారు కాదు. దానితో జనాలకి అంతగా ఈ షో పై ఇంట్రెస్ట్ లేదు. రేటింగ్ ఒక్కసారికి పడిపోయిందని టాక్.  ఇక లాభం లేదనుకున్నారో ఏమో... గత సీజన్లలో ఇంటి సభ్యులుగా ఉన్న పలువురిని వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అనుమతించారు. ఆదివారం ‘బిగ్‌బాస్‌ గ్రాండ్‌ రీలోడ్‌’ పేరిట ఎపిసోడ్‌ ప్రసారం అయిన షోలో ఏం జరిగింది చూసేయండి...


మొదటి ఎంట్రీ హరితేజ (hari Teja)
బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది హరితేజ. ఆ సీజన్‌లో ఆమె ఆటతోపాటు బుర్రకథ సీన్‌ ఎంతగా పేలిందో తెలిసిందే. గ్రాండ్‌ ఫినాలే వరకు చేరుకుని సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. ఈ షో తర్వాత సినిమాల్లో బిజీ అవడమే కాకుండా హోస్ట్‌గానూ అవతారమెత్తింది.  ఇప్పుడు బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌లో మొదటి వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. హౌసులోకి వెళ్లేముందు ేస్టజీపైకి హరితేజ కూతురుని తీసుకురావడంతో ఆమె ఎమోషనల్‌ అయి కన్నీళ్లు పెట్టుకుంది.


రెండో ఎంట్రీ... తేజ  (tasty Teja)
టేస్టీ తేజాగా గుర్తింపు పొందిన తేజ అసలు పేరు తేజ్‌దీప్‌. తెనాలిలో పుట్టిపెరిగాడు. 2017లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా హైదరాబాద్‌లో ఎంటర్‌ అయ్యాడు. 2020లో వర్క్‌ ఫ్రమ్‌ హోంలో ఉన్నప్పుడు తెనాలిలో స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లి భోజనం చేశాడు. ఆ వీడియో యూట్యూబ్‌లో పెట్టగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇదేదో బాగుందనిపించి హైదరాబాద్‌ వచ్చాక అదే కొనసాగించాడు. యూట్యూబర్‌గా తిండి వీడియోలు చేస్తూ బిజీ అయ్యాడు. అలా బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో పాల్గొన్నాడు. తొమ్మిదివారాలపాటు హౌస్‌లో ఉన్నాక షోకి టాటా బైబై అన్నాడు. ఇప్పుడు ఎనిమిదో సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు.



మూడో వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా నయని పావని (Nayani pavani)హౌస్‌లో అడుగుపెట్టింది. పావని అసలు పేరు సాయిరాజు పావని. టిక్‌టాక్‌ స్టార్‌గా ఫేమస్‌. షార్ట్‌ ఫిలింస్‌, కవర్‌ సాంగ్స్‌, చిత్తం మహారాణి, సూర్యకాంతం వంటి చిత్రాల్లోనూ కనువిందు చేసిన ఈ బ్యూటీ బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. దురదృష్టం కొద్దీ వారానికే ఎలిమినేట్‌ అయిపోయింది. అయితే నయని నెక్స్ట్‌ సీజన్‌లో రావడం పక్కా అనుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే ఈ సీజన్‌లో అడుగుపెట్టింది. కాకపోతే మరోసారి వైల్డ్‌కార్డ్‌ ద్వారానే ఎంట్రీ ఇచ్చింది.  




నాలుగో కంటెస్టెంట్‌గా మోహబూబా (Mehabooba)అడుగుపెట్టారు. డ్యాన్స్‌, యాక్టింగ్‌ అంటే అతనికి పిచ్చి. కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల సాఫ్ట్‌వేర్‌ కొలువులో చేరినా కళను వదిలేయలేకపోయాడు. వెబ్‌ సిరీస్‌, కవర్‌  షార్ట్‌ ఫిలింస్‌, టిక్‌టాక్‌ వీడియోలతో ఫేమస్‌ అయ్యాడు. తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో అడుగుపెట్టిన టాస్కుల్లో సత్తా చూపించాడు. కండబలం బాగానే ఉన్నా బుద్థి బలం తక్కువగా ఉండటంతో ఫినాలే వరకు వెళ్లకుండానే వెనుదిరిగాడు. ఇప్పుడు బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు.  

ఐదో వైల్డ్‌ కార్డ్‌గా రోహిణి (Rohini)
సీరియళ్లు. టీవీ షోలు, వెబ్‌ సిరీస్‌లతో ఆకట్టుకుంటుంది రోహిణి. బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొన్న రోహిణి.. మరోసారి ఈ రియాలిటీ షోలో వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఇక శివజ్యోతి.. రోహిణి కోసం స్పెషల్‌ వీడియో పంపింది. హౌసులో కామెడీ లోటు బాగా ఉందని, దాన్ని ఫుల్‌ ఫిల్‌ చేయాలని చెప్పింది.

ఆరో ఎంట్రీ గౌతమ్‌ కృష్ణ (Goutham Krishna)
గౌతమ్‌ కృష్ణ.. బిగ్‌బాస్‌కు రావడానికి ముందు పలు చిత్రాల్లో నటించాడు.  జనాలకు తెలిసింది మాత్రం బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌తోనే! దర్శకుడు కాబోయి డాక్టర్‌ అయ్యాడు. తన కోరికను చంపుకోలేక 2018లో దర్శకత్వంలో శిక్షణ పొందాడు. ఆ మరుసటి ఏడాది ఆకాశవీధుల్లో సినిమాకు సొంతంగా కథ రాసుకుని తనే డైరెక్ట్‌ చేస్తూ హీరోగా నటించాడు. గత సీజన్‌లో ఫినాలే వరకు రాలేకపోయాడు. తాజాగా మరోసారి వైల్డ్‌ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చాడు.


ఏడో ఎంట్రీ అవినాష్‌ (Avinash)
జగిత్యాలవాసి అయిన అవినాష్‌కు నటన అంటే పిచ్చి. ఆ తపనతో అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాడు. టీవీ షోలతో పాపులర్‌ అయ్యి సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో ఆఫర్‌ వచ్చింది.  ఇదే విషయం కామెడీ షో నిర్వాహకులకు చెబితే.. ఇంకా రెండేళ్ల అగ్రిమెంట్‌ ఉందని, మధ్యలో వెళ్తే రూ.10 లక్షలు కట్టాలని హెచ్చరించారు. ఆర్థిక అవసరాల వల్ల ేస్నహితుల సాయం తీసుకుని మరీ ఆ డబ్బు కట్టేసి బిగ్‌బాస్‌కు వెళ్లాడు. వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన అవినాష్‌.. 12 వారాలు హౌస్‌లో ఉండి ఎంటర్‌టైనర్‌ అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరోసారి బిగ్‌బాస్‌ 8లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇచ్చాడు.

ఎనిమిదో ఎంట్రీ గంగవ్వ.. (Gangavva)
వయసైపోయాక ఏ పనీ చేతకాక ఓ మూలన కూర్చోవాల్సిందే అని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పని నిరూపించింది గంగవ్వ. టాలెంట్‌ ఉంటే ఏ వయసులోనైనా రాణించవచ్చని నిరూపించింది. జగీత్యాల జిల్లా లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ ఒకప్పుడు దినసరి కూలీ. కానీ ఇప్పుడు తన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. తన కట్టుబొట్టు, అమాయకత్వం, గడుసుతనం.. జనా?కు నచ్చేశాయి. బిగ్‌బాస్‌ నుంచి పిలుపు వచ్చింది. నాలుగో సీజన్‌లో అడుగుపెట్టింది. స్వచ్భమైన పల్లెలో బతికిన మట్టిమనిషికి ఏసీ పడలేదు. ఈ గోస నావల్ల కాదంటూ దండం పెట్టి బయటకు వచ్చేసింది. అయితే సొంతింటి క?ను నెరవేర్చుకుంది. ఇప్పుడు మరోసారి ధైౖర్యం చేసి బిగ్‌బాస్‌ 8లోకి వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇచ్చింది. 

మరి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన పాత ఇంటి సభ్యులు ఏ మేరకు అలరిస్తారో.. చూడాలి. 

Updated Date - Oct 07 , 2024 | 12:47 PM