మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bangalore Rave Party: రేవ్ పార్టీ అని తెలియదు.. నటి ఆషీ రాయ్ వీడియో వైరల్

ABN, Publish Date - May 22 , 2024 | 05:06 PM

బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం బయటికి వచ్చినప్పటి నుంచి.. సోషల్ మీడియాలో కొందరు పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి. ఆ పేర్లలో నటి ఆషీ రాయ్ పేరు కూడా ఒకటి. అయితే ఈ పార్టీకి తను వెళ్లినట్లుగా తాజాగా ఆషీ రాయ్ ఓ వీడియోను విడుదల చేసింది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి వెళ్లాను కానీ.. అది రేవ్ పార్టీ అని తనకు తెలియదని, వాసు అనే అతను బర్త్‌డే పార్టీ అని పిలిస్తే వెళ్లినట్లుగా చెప్పుకొచ్చింది.

Ashi Roy on Bangalore Rave Party

బెంగళూరు శివారులో జరిగిన రేవ్ పార్టీ (Bangalore Rave Party) కర్ణాటకతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలకలం రేపుతోంది. ఈ పార్టీకి పలువురు రాజకీయ నాయకులు, హీరోహీరోయిన్లు హాజరైనట్లుగా తొలుత ప్రచారం జరిగింది. మరీ ముఖ్యంగా నటి హేమ (Actress Hema) పేరు బాగా వైరల్ అవుతోంది. హేమతో పాటు కొందరి పేర్లు వినిపించినా.. పోలీసులు మాత్రం హేమ పేరు మాత్రమే బయటపెట్టారు. మిగతా ఎవరీ పేరు బయటికి రానివ్వలేదు. అయితే ఈ రేవ్ పార్టీ వ్యవహారం బయటికి వచ్చినప్పటి నుంచి.. సోషల్ మీడియా (Social Media)లో కొందరు పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి. ఆ పేర్లలో నటి ఆషీ రాయ్ పేరు కూడా ఒకటి. అయితే ఈ పార్టీకి తను వెళ్లినట్లుగా తాజాగా ఆషీ రాయ్ (Ashi Roy) ఓ వీడియోను విడుదల చేసింది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి వెళ్లాను కానీ.. అది రేవ్ పార్టీ (Rave Party) అని తనకు తెలియదని, వాసు (Vasu) అనే అతను బర్త్‌డే పార్టీ అని పిలిస్తే వెళ్లినట్లుగా చెప్పుకొచ్చింది.

*Rave Party Hema: ఇది ఆమె నిజ స్వరూపం.. హేమపై సహనటి సంచలన వ్యాఖ్యలు


ఈ వీడియోలో ఆషీ రాయ్ (Ashi Roy Video Goes Viral) మాట్లాడుతూ.. ‘‘నేను బర్త్ డే పార్టీ అనుకుని మాత్రమే వెళ్లాను. వాసు నన్ను సోదరిగా భావిస్తుంటాడు. వాసు బ్రదర్ బర్త్‌డే పార్టీ అంటే వెళ్లాను తప్ప అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది నాకు తెలియదు. దయచేసి నాకు హెల్ప్ చేయండి. నేను ఒక ఆడపిల్లను. ఇప్పుడిప్పుడే కష్టపడి ఇండస్ట్రీలోకి వస్తున్నాను.. ప్లీజ్ దయచేసి నాకు హెల్ప్ చేయండి’’ అని చెప్పుకొచ్చింది. కాగా.. ‘వైతరణి రాణా, లాక్ డౌన్, మిస్టరీ ఆఫ్ సారిక, కెఎస్ 100’ వంటి చిత్రాల్లో ఆషీ రాయ్ నటించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు ‘వెళ్లేటప్పుడు ఆడపిల్లవని తెలియలేదా’ అంటూ కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - May 22 , 2024 | 05:07 PM