AP Deputy CM Pawan Kalyan: నాకు రామోజీరావు ఏం చెప్పేవారంటే..
ABN, Publish Date - Jun 27 , 2024 | 07:23 PM
సినిమాలు చేసే సమయంలో రామోజీరావుతో ప్రత్యక్ష అనుబంధం లేదు కానీ.. 2008లో నేరుగా ఒకసారి రామోజీరావును కలిసి మాట్లాడాను అని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గురువారం రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు సంస్మరణ సభను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సినిమాలు చేసే సమయంలో రామోజీరావుతో ప్రత్యక్ష అనుబంధం లేదు కానీ.. 2008లో నేరుగా ఒకసారి రామోజీరావును కలిసి మాట్లాడాను అని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan). గురువారం రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు సంస్మరణ సభను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. కృష్ణా జిల్లా, పెనమలూరు మండలం, తాడిగడప-ఎనికెపాడు 100 అడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్స్‌లో అక్షరయోదుడు రామోజీరావు సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రామోజీరావుతో తనకున్న పరిచయాన్ని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. (Ramoji Rao Samsmarana Sabha)
Also Read- Kalki 2898AD Review: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపిక నటించిన సినిమా ఎలా ఉందంటే...
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ.. ‘‘నేను చూసిన రామోజీరావులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సినిమాలు చేసే సమయంలో రామోజీరావుతో ప్రత్యక్ష అనుబంధం లేదు. 2008లో నేరుగా ఒకసారి రామోజీరావును కలిసి మాట్లాడాను. ఆయన ప్రజల పక్షపాతి... జర్నలిస్టు విలువను కాపాడటంలోనూ, ప్రజల కోసం ఏం చేయాలనే అంశాలపైనే ఆలోచించారు. 2019లో నన్ను లంచ్ మీటింగ్‌కు రామోజీరావు ఆహ్వానించారు. దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులు, పత్రికా రంగం గురించి మా మధ్య చర్చ సాగింది. జనం తాలూకా అభిప్రాయాలే వారి పేపర్లో ప్రతిబింబిస్తాయి. లంచ్ మీటింగ్ సమయంలో రామోజీరావు వేదనను నేను నేరుగా చూశాను. ప్రజాస్వామ్యానికి పత్రిక స్వేచ్ఛ ఎంతో అవసరమో ఈ దేశానికి చాటి చెప్పారు. అటువంటి వ్యక్తిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనందరికీ తెలుసు. పేపర్ ఒక్కటే నడపటం చాలా కష్ట సాధ్యం.. కానీ విలువలతో ముందుకు సాగారు. ఇతర వ్యాపారాలపై దాడులు చేసినా.. తట్టుకుని.. జర్నలిస్టుగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకు సాగారు. అవన్నీ తెలుసుకుని నాకు చాలా సంతోషం అనిపించింది. నువ్వు ఏం చేస్తావో.. ఏం నమ్ముతావో త్రికరణ శుద్దిగా చేయి అని నాకు రామోజీరావు సూచించారు. రైట్ టూ ఇన్‌ఫర్మేషన్ యాక్టు గురించి ఉద్యమ కర్తగా వ్యవహరించారు. ఆర్.టి.ఐ ద్వారా ప్రభుత్వం ఏమి చేసినా ప్రజలు తెలుసుకోవచ్చని చాటి చెప్పారు.
స్టూడియోలు కట్టినా, సినిమాలు చేసినా.. ఆదర్శ జర్నలిస్టు భావాలు ఆయనలో చాలా ఉన్నాయి. జర్నలిస్టు విలువలను కాపాడిన రామోజీరావు పత్రికాధిపతిగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులను బెదిరించినా.. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఇలా దైర్యంగా నిలబడటానికి చాలా దైర్యం కావాలి. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో కూటమి విజయ వార్త విన్నారా లేదా అని నేను కూడా అడిగి తెలుసుకున్నా. విజయ వార్త విన్న తర్వాతే ఆయన తన ప్రాణాలు విడిచారు. అటువంటి మహోన్నత వ్యక్తి విగ్రహం అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. ఎవరు ఏస్థాయిలో ఉన్నా పత్రికా స్వేచ్చను కాపాడాలి. ఎవరినైనా వారు చేసే పనిని బట్టే.. పాజిటివ్, నెగిటివ్ వార్తలు వేస్తారు. గతంలో అన్ని పార్టీలను పైకి ఎత్తిన సందర్భాలు ఉన్నాయి.. విమర్శలు చేసిన సందర్భాలు చూశాం. ఆయన జర్నలిస్టిక్ వారసత్వ విలువలను ప్రతి జర్నలిస్టు తీసుకోవాలి. అది ఎంతవరకు తీసుకుంటారో ప్రతి జర్నలిస్టు తెలుసుకోవాలి. రామోజీ జీవితం నిరంతర ప్రవాహం.. అందరూ తెలుసుకోవాలి’’ అని చెప్పుకొచ్చారు.
Read Latest Cinema News