Deputy CM Pawan Kalyan Viral video: చిన్న బాబు కోసం కాన్వాయ్ ఆపి మరీ... అదే పవన్ కళ్యాణ్ అంటే...

ABN, Publish Date - Jul 03 , 2024 | 02:30 PM

పవన్ కళ్యాణ్ మరోసారి తను ఎంత డౌన్ తో ఎర్త్ మనిషో నిరూపించుకున్నారు. ఉప్పాడ వెళుతూ మార్గమధ్యంలో ఒక చిన్న పిల్లవాడు జనసేన జెండా పట్టుకొని ఉంటే,తన కాన్వాయిని ఆపి ఆ పిల్లవాడిని పలకరించి వెళ్లారు పవన్ కళ్యాణ్. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది

AP Deputy CM Pawan Kalyan is seen stopping his convoy to greet a small kid

పవన్ కళ్యాణ్ పేరు వినపడితే చాలు అది ఎటువంటి ఫంక్షన్ అయినా అక్కడ హాహా కారాలు మిన్నంటుతాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి అంతమంది అభిమానులు వున్నారు. అది వేరేవాళ్ళ సినిమా ఫంక్షన్ అయినా, లేక ఇంకెంటువంటి ఈవెంట్ అయినా, అక్కడ పవన్ కళ్యాణ్ ఉండనవసరం లేదు, అతని పేరు వినిపిస్తే చాలు, కొన్ని నిముషాల పాటు ఆ వేదిక దద్దరిల్లిపోవాల్సిందే. అదీ పవన్ కళ్యాణ్ పవర్, అందుకే అతను పవర్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు!

పదవి తీసుకున్న దగ్గరనుంచి పవన్ కళ్యాణ్ అసలు మామూలుగా ఉండటం లేదు కదా, అది పదవి కాదు, ప్రజలకి సేవ చెయ్యడానికి తనకి వచ్చిన బాధ్యత అని చెప్పాడు. అందుకే అధికారులను పరుగులు పెట్టిస్తూ, తాను పరిగెడుతూ, ఎక్కడైనా అవినీతి ఉంటే దానిని వేళ్ళతో సహా పెకలించడానికి సమాయత్తం అవుతున్నాడు. తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియచేయడం కోసం నిన్న పిఠాపురం వచ్చాడు. మీ రుణం తీర్చుకోలేను అని చెప్పాడు వాళ్లకి. ఆంధ్ర ప్రదేశ్ పేరు ప్రపంచం అంతా మారుమోగేట్టు చేస్తాను అన్నాడు. అదే చేస్తున్నాడు.

ఈరోజు ఉప్పాడ గ్రామానికి తన కాన్వాయ్ లో వెళుతూ ఉండగా ఒక చిన్న పిల్లవాడు తన ఇంటి గేటు ముందు జనసేన జెండా పట్టుకొని ఊపుతూ కనిపించాడు. అంతే పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ తన కారులోనుండి కిందకి దిగాడు, ఆ పిల్లవాడి భుజం తట్టాడు, ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. అది కదా పవన్ కళ్యాణ్ అంటే! అందుకు కదా అతనికి అంతమంది అభిమానులు. అందుకు కదా అతను అక్కడ లేకపోయినా అతని పేరు చెపితే చాలు కరతాళ ధ్వనులు మిన్నంటుతాయి.

ఇప్పుడు ఈ వీడియో, ఫోటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది. పరి పరి విధాలా పవన్ కళ్యాణ్ ని ప్రశంసిస్తూ అందరూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక పెద్ద స్టార్ ఎటువంటి భేషజం లేకుండా ఒక చిన్న పిల్లవాడిని చూసి మురిసిపోయి, కాన్వాయ్ ఆపించి మరీ ఆ పిల్లవాడి భుజం తట్టి వెళ్ళాడు అంటే అదేమీ చిన్న విషయం కాదు. అది అతని సంస్కారం, అందుకే అతన్ని ఎంత పొగిడినా తక్కువే!

Updated Date - Jul 03 , 2024 | 02:30 PM