కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TIllu Square: అనుపమ ఏంటి ఇలా, మంట పుట్టించింది, అభిమానులు నిరాశ...

ABN, Publish Date - Jan 01 , 2024 | 03:29 PM

ఇంతవరకు మామూలుగా గ్లామర్ పాత్రలో ఎక్కడా కనిపించని అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా 'టిల్లు స్క్వేర్' సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ పక్కన ఒక గ్లామర్ పాత్రలో చూసిన ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

Anupama and Siddhu Jonnalagadda from Tillu Square

మలయాళం నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) తెలుగులో 'అ.. ఆ.. ' సినిమా ద్వారా పరిచయం అయింది. త్రివిక్రమ్ (Trivikram Srinivas) ఆ సినిమాకి దర్శకుడు, నితిన్ కథానాయకుడు, సమంత (Samantha) కథానాయిక. ఆ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించిన అనుపమ తన తెలుగు తానే డబ్బింగ్ చెప్పుకొని, మంచి నటి అని నిరూపించుకుంది. ఆ తరువాత అనుపమ చాలా సినిమాలు చేసింది, కానీ ఎక్కడా గ్లామర్ రోల్ మాత్రం చెయ్యలేదు. అన్నీ మంచి పాత్రలే చేసింది, అలాగే తనకి ఇచ్చిన పాత్రలకు న్యాయం చేస్తూ, మంచి నటిగా ప్రతి సినిమాకి మంచి పేరు సంపాదించింది.

అయితే ఇన్ని తెలుగు సినిమాలు చేసినా, మంచి నటిగా పేరుపొందిన అనుపమ ఎందుకో అగ్ర నటులతో సినిమాలు చెయ్యలేకపోయింది. 'రంగస్థలం' #Rangasthalam సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) పక్కన చెయ్యాల్సింది, కానీ చివరి నిముషంలో సమంత ఆ పాత్రని కొట్టేసింది. ఇలా కొన్ని ఛాన్సులు అనుపమకు మిస్ అయ్యాయి. అగ్ర నటీమణుల్లో చేరలేకపోయింది ఇంతవరకు, కానీ సినిమాలతో బిజీ గా ఉంటోంది.

తాజా సినిమా 'టిల్లు స్క్వేర్' #TilluSquare లో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) పక్కన చేస్తోంది. ఇది 'డీజే టిల్లు' #DJTillu కి సీక్వెల్ గా వస్తోంది. మొదటి సినిమాలో కొంచెం అడల్ట్ జోకులు ఉండటం, మామూలుగా సిద్ధు సినిమాల్లో కూడా అవి ఎక్కువగా కనపడటం, అటువంటిది అనుపమ ఇప్పుడు సిద్ధు నటిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా నటించడంతో అనుపమ అభిమానులు ఒక్కసారిగా నిరాశపడ్డారు. ఇంతకు ముందు విడుదలైన పాటలు రెండూ పెద్ద విజయం సాధించాయి కానీ, అందులో అనుపమ చాలా గ్లామర్ గా కనిపించడం, ఇంతకు ముందు ఏ సినిమాలోనూ ఇంత గ్లామర్ పాత్రలు చేయకపోవటంతో అభిమానులు ఒక్కసారిగా కంగుతిన్నారు.

ఇదిలా ఉంటే, నూతన సంవత్సరం కానుకంగా 'టిల్లు స్క్వేర్' నుండి ఒక పోస్టర్ విడుదలైంది. అందులో అనుపమ సిద్ధు జొన్నలగడ్డ వొళ్ళో కూర్చొని వుంది. ఆ ఇద్దరూ కొంచెం ఇంటిమసీ తో వున్న ఆ పోస్టర్ చూసి అనుపమ అభిమాని ఒకరు 'ఈ పోస్టర్ చూసాక, నా హృదయం భగ్నం అయింది, ఇక నేను సాయి పల్లవి అభిమానిని అయిపోతాను' అని కామెంట్ పెట్టాడు. ఇంకొక అభిమాని కూడా అలాంటి పోస్టునే పెట్టాడు. ఇంకో అభిమాని అయితే హార్ట్ బ్రేక్ తో ఇయర్ పూర్తయింది అని కామెంట్ చేసాడు. ఇలా అనుపమ అభిమానులు అందరూ చాలా నిరాశ పడి ఆమె పెట్టిన ఈ పోస్టర్ కి కామెంట్స్ పెడుతున్నారు. అనుపమ రవి తేజ నటించిన 'ఈగిల్' సినిమాలో కూడా వుంది. ఈ సినిమా సంక్రాంతి పండగకి విడుదలవుతోంది.

Updated Date - Jan 01 , 2024 | 03:35 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!