కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anjali: ముద్దుగా కనిపించినా.. నా పనులు అలా ఉంటాయి

ABN, Publish Date - Jan 06 , 2024 | 09:39 PM

హీరోయిన్ అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ నిర్మిస్తున్నారు. అంజ‌లి న‌టిస్తోన్న‌ 50వ సినిమా ఇది. తాజాగా ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేసేందుకు మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు.

Anjali

హీరోయిన్ అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi). రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ (Kona Venkat) సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ నిర్మిస్తున్నారు. అంజ‌లి న‌టిస్తోన్న‌ 50వ సినిమా ఇది. హారర్ కామెడీ జోనర్‌లో ట్రెండ్ సెట్ చేసిన ‘గీతాంజలి’ (Geethanjali) సినిమాకు ఇది సీక్వెల్. ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాను శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్నారు. శనివారం ఈ సినిమాలోని క్యారెక్టర్స్‌ను పరిచయం చేసేందుకు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో అంజలి (Anjali) మాట్లాడుతూ ‘‘ ‘గీతాంజలి’ నా కెరీర్‌లో తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. చాలా పెద్ద హిట్ అయ్యింది. అదే కాన్ఫిడెన్స్‌తోనే ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా చేశాం. సీక్వెల్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాం. సినిమా చూశాను. చాలా బావుంది. సినిమా అంతా ఒక ఎత్తైతే.. క్లైమాక్స్ మరో రేంజ్‌లో ఉంటుంది. విజువల్, గ్రాండ్‌నెస్ నెక్ట్స్ రేంజ్‌లో ఉంటాయి. సీక్వెల్‌లో పార్ట్ 2 వెయిట్‌ను మోయటానికి స్టార్ క్యాస్ట్ పెరిగింది. అలీ, సునీల్, సత్య ఇలా అందరూ నవ్విస్తారు. డైరెక్టర్ శివ తుర్లపాటిగారికి ఈ సినిమా చాలా పెద్ద బ్రేక్ అవుతుంది. సినిమాటోగ్రాఫర్ సుజాత సిద్ధార్థ్ విజువల్స్ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, రాజేష్ నా కోస్టార్స్‌గా పార్ట్ 1లో నటించారు. సీక్వెల్‌లోనూ నవ్విస్తారు. మూవీకోసం గ్రేట్ సెట్ వేసిన శ్రీనుగారు, అద్భుతమైన సంగీతాన్ని అందించిన ప్రవీణ్ లక్కరాజుగారు, ఎడిటర్ చోటాగారు అద్భుతంగా చేశారు. గీతాంజలి ముద్దుగా కనిపించినా తను చేసే పనులు భయపెడతాయి. వాటిని థియేటర్స్‌లో చూడాల్సిందే. కోన వెంకట్ గారు గీతాంజలి చిత్రాన్ని ఫ్రాంచైజీగా రూపొందిస్తూ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ చేశారు. కోనగారి కామెడీ ట్రాక్, సినిమాను ఆయన డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంది’’ అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Director Vijay Binni: ‘నా సామిరంగ’లో చాలా సర్‌ప్రైజ్‌లున్నాయ్..

**************************

*RC16: ఆయనే.. అధికారికంగా ప్రకటించేశారు

***********************

*Nawazuddin Siddiqui: విక్టరీ వెంకటేష్ నుండి అందరూ అది నేర్చుకోవాలి

****************************

*Dhanush: సోషల్‌ మీడియాతో జర జాగ్రత్త!

****************************

Updated Date - Jan 06 , 2024 | 09:39 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!