మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Anikha Surendran: నా దుస్తులు.. నా ఇష్టం.. అనికా కౌంటర్!

ABN, Publish Date - May 23 , 2024 | 02:41 PM

సోషల్‌ మీడియా వేదికగా తన వస్త్రధారణ గురించి కామెంట్స్‌ చేస్తున్న నెటిజన్లకు యువ నటి అనికా సురేంద్రన్‌ గట్టిగా కౌంటరిచ్చారు. నా దుస్తులు.. నా ఇష్టం.. నేను ఎలాగైనా ధరిస్తానంటూ సమాధానమిచ్చారు. అగ్రహీరో అజిత్‌ నటించిన ‘విశ్వాసం’ చిత్రంలో ఆయన కుమార్తెగా నటించిన అనికా.. ఇపుడు హీరోయిన్‌ స్థాయికి చేరుకున్నారు. అయినప్పటికీ కోలీవుడ్‌ ప్రేక్షకుల మనసుల్లో అజిత్‌ కుమార్తెగానే గుర్తుండిపోయింది.

Anikha Surendran

సోషల్‌ మీడియా వేదికగా తన వస్త్రధారణ గురించి కామెంట్స్‌ చేస్తున్న నెటిజన్లకు యువ నటి అనికా సురేంద్రన్‌ (Anikha Surendran) గట్టిగా కౌంటరిచ్చారు. నా దుస్తులు.. నా ఇష్టం.. నేను ఎలాగైనా ధరిస్తానంటూ సమాధానమిచ్చారు. అగ్రహీరో అజిత్‌ (Ajith) నటించిన ‘విశ్వాసం’ (Viswasam) చిత్రంలో ఆయన కుమార్తెగా నటించిన అనికా.. ఇపుడు హీరోయిన్‌ స్థాయికి చేరుకున్నారు. అయినప్పటికీ కోలీవుడ్‌ ప్రేక్షకుల మనసుల్లో అజిత్‌ కుమార్తెగానే స్థిరపడిపోయారు. అదేసమయంలో ఆమె సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా గ్లామర్‌ను ఎక్స్‌పోజ్‌ చేసేలా దుస్తులు ధరిస్తూ, ప్రత్యేక ఫోటో షూట్‌లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. దీంతో నెటిజన్లు ఆమె మనసు గాయపడేలా కామెంట్స్‌ చేస్తున్నారు. (Anikha Surendran Counter)

*Bengaluru Rave Party: సంచలన విషయాలు వెలుగులోకి, అడ్డంగా దొరికిపోయిన హేమ


ఈ నేపథ్యంలో ఇటీవల చెన్నై నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనికా (Anikha) మాట్లాడుతూ.. ‘నాకు స్టైల్‌గా ఉండటం, మంచి దుస్తులు ధరించడం అంటే ఎంతో ఇష్టం. గ్లామర్‌ ఎక్స్‌పోజింగ్‌ చేసే దుస్తులు ధరించడం అనేది నా వ్యక్తిగతం. కానీ, ఎలాంటి దుస్తులు ధరించినా పలువురు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలోని వారు ఇలాంటి విమర్శలు అధికంగా ఎదుర్కొంటున్నారు. నేను ఎలా ఉండాలో, ఎలాంటి దుస్తులు ధరించాలో వేరే వారు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు నచ్చినట్లుగా నేను ఉంటా. నాకు నచ్చిన డ్రస్ వేసుకుంటా. నా ఫ్యామిలీకి ఇబ్బంది లేనప్పుడు.. ఎవరో చెప్పిన మాటలను, వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు..’’ అనేలా చెప్పుకొచ్చింది.

కాగా.. కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ఘోస్ట్’ (The Ghost), అర్జున్ దాస్ ‘బుట్టబొమ్మ’ (Butta Bomma), దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కోత’ (King Of Kotha) చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా అనికా సురేంద్రన్‌ పరిచయమే.

Read Latest Cinema News

Updated Date - May 23 , 2024 | 02:41 PM