Amala Paul: ఇద్దరు ముగ్గురు కాబోతున్నారు!
ABN, Publish Date - Jan 04 , 2024 | 11:19 AM
కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అభిమానులకు శుభవార్త చెప్పింది అమలాపాల్. ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న ఆమె గర్భం దాల్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. '
కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అభిమానులకు శుభవార్త చెప్పింది అమలాపాల్. ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న ఆమె గర్భం దాల్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. 'ఇద్దరం ముగ్గురు కాబోతున్నాం’ అని అమలాపాల్ పోస్ట్ చేసింది. ఇంతకుముందు దర్శకుడు ఎ. ఎల్.రాజాను వివాహమాడిన అమలా పలు కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. దాదాపు ఆరేళ్లు ఆమె ఒంటరిగానే ఉంది. గత ఏడాది జూన్ నుంచి ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్‌తో డేటింగ్‌లో ఉంది. కేరళలోని కొచ్చిలో నవంబర్ 5న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతి కావడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. 'బెజవాడ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన అమలాపాల్ రామ్‌చరణ్ సరసన 'నాయక్', తదుపరి అల్లు అర్జున్ తో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రాల్లో నటించి విజయాన్ని అందుకున్నారు. సౌత్ సినిమాలతోపాటు బాలీవుడ్ చిత్రాల్లోనూ అవకాశం అందు కొంటుంది. ప్రస్తుతం బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జంటగా ఆడుజీవితంలో అమలాపాల్ కనిపించనుంది. ఆ తర్వాత ద్విజ అనే మరో మలయాళ చిత్రంలో నటిస్తోంది.