Allu Aravind: మనవడు బ్యాటింగ్‌.. తాత బౌలింగ్‌.. సీన్ సూపర్‌

ABN, Publish Date - Aug 12 , 2024 | 04:16 PM

టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్స్‌లో అల్లు అరవింద్‌ (Allu Aravind) ఒకరు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్‌, దానికి అనుబంధ సంస్థ అయిన జీఎ2 పిక్చర్స్‌ బ్యానర్‌లలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే ఆయన తాజాగా ఫ్రీ టైమ్‌ను ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు

టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్స్‌లో అల్లు అరవింద్‌ (Allu Aravind) ఒకరు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్‌, దానికి అనుబంధ సంస్థ అయిన జీఎ2 పిక్చర్స్‌ బ్యానర్‌లలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే ఆయన తాజాగా ఫ్రీ టైమ్‌ను ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు. అల్లు అర్జున్‌ తనయుడు, తన మనవడు అయాన్‌తో (Allu ayaan) కలిసి ఇంటి ఆవరణలో సరదాగా క్రికెట్‌ ఆడారు. అయాన్‌ బ్యాటింగ్‌ చేయగా.. అరవింద్‌ బౌలింగ్‌ చేశారు. Allu arvaind cricket with Allu ayaan) దీనికి సంబంధించిన ఓ వీడియోను తాజాగా బన్నీ సతీమణి స్నేహారెడ్డి ఇన్  స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేశారు.

అయాన్‌ భవిష్యత్తులో మంచి క్రికెటర్‌ అవుతాడంటూ ఫ్యాన్స్  కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అరవింద్‌ సమర్పణలో ‘తండేల్‌’ సినిమా తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై సిద్థమవుతోన్న ఈ చిత్రాన్ని బన్నీవాసు నిర్మిస్తున్నారు. నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రమిది. చందు మొండేటి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఓ మత్స్యకారుడి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న చిత్రమిది.

Updated Date - Aug 12 , 2024 | 05:13 PM