Allu Ayaan: అల్లు అయాన్ నోట ‘డంకీ’ పాట.. రియాక్టైన షారుఖ్ ఖాన్.. పట్టలేనంత ఆనందంలో బన్ని!
ABN, Publish Date - Feb 25 , 2024 | 05:40 PM
అల్లు అయాన్ పాటకు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ రియాక్ట్ అయి తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు ఆ పోస్టు అయాన్ పాడిన పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
అల్లు అయాన్ పాటకు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) రియాక్ట్ అయి తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. అసలు విషయానికి వస్తే అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ AlluAyaan , కుమార్తె అర్హ కారులో ప్రయాణిస్తుండగా అయాన్ ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన షారుఖ్ ఖాన్ డంకీ (Dunki) సినిమాలోని లుట్ ఫుట్ గయా అనే పాటను పాడాడు. ఈ దృశ్యాన్ని ఫోన్ లో రికార్డ్ చేసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. షారుఖ్ ఖాన్ కు ట్యాగ్ చేశారు.
దీంతో ఈ వీడియోను చూసిన షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) స్పందిస్తూ.. థ్యాంక్యూ లిటిల్ వన్.. నీవు పాడిన పాటలో ప్లవర్, ఫైర్ రెండు చూయించావని, నేను కూడా నా పిల్లలకు పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటను నేర్పిస్తా అంటూ రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు ఆ పోస్టు, అయాన్ (Allu Ayaan) పాడిన పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగానే షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పోస్టుకు అల్లు అర్జున్ (Allu Arjun) ‘షారుఖ్ జీ (Shah Rukh Khan) సో స్వీట్ ఆఫ్ యూ.. మీ హంబుల్ మెసేజ్ కి ధన్యవాదాలు’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ పోస్టు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.