ఆ జాతర పాత్ర కోసం అల్లు అర్జున్ అంకిత భావం, ఏమి చేసారంటే...
ABN, Publish Date - Jan 18 , 2024 | 03:51 PM
అల్లు అర్జున్ 'పుష్ప 2' లో ఒక ప్రత్యేక పాత్రలో కనపడటానికి ఎంత అంకిత భావం, నిబద్దత తో పని చేస్తున్నారు అనే విషయంలో ఆ సినిమా యూనిట్ సభ్యులే ఆశ్చర్యపోతున్నారు. ఆ పాత్ర కోసం అల్లు అర్జున్ ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తున్నారు అంటే...
'పుష్ప' సినిమాలో చేసిన పుష్పరాజ్ పాత్రకి గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఆ సినిమాకి రెండో పార్టు అయిన 'పుష్ప 2' షూటింగ్ లో బిజీగా వున్నారు. సుకుమార్ దర్శకుడు, ఈ సినిమా ఆగస్టు 15 తేదీన విడుదల చేస్తున్నామని ఇదివరకే చిత్ర నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే. రష్మిక మందన్న కథానాయకురాలిగా చేస్తోంది. ఈ సినిమా గురించి, ఇందులో అల్లు అర్జున్ తన పాత్ర పట్ల ఎంత అంకిత భావంతో చేస్తున్నారు అనేది యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఈ చిత్రం నుండి కొన్ని నెలల క్రితం అల్లు అర్జున్ ఒక జాతర వేషంలో వున్న పోస్టర్ విడుదలైంది. తాజా సమాచారం ప్రకారం, ఆ గంగమ్మ జాతర షూటింగ్ దర్శకుడు సుకుమార్ ఈమధ్యనే ఒక నెల రోజుల పాటు చేసారని తెలిసింది. ఆ గంగమ్మ జాతర, అల్లు అర్జున్ ప్రత్యేకంగా కనపడే ఆ జాతర లుక్ అన్నీ సినిమాలో హైలైట్ అవుతాయని అంటున్నారు.
ఇదిలా ఉంటే, ఆ జాతర పాత్ర కోసం అల్లు అర్జున్ మేకప్ వేసుకున్నప్పుడు, లొకేషన్ లో ఎక్కువగా ఎవరితో మాట్లాడకుండా, తాను వేసిన పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చెయ్యడం కోసం, ఆ పాత్రలోనే మమేకమై చేశారని తెలిసింది. మామూలుగా అయితే షూటింగ్ లొకేషన్స్ లో పక్క నటులతో మాట్లాడటం చెయ్యడం జరుగుతూ ఉంటుంది, కానీ అల్లు అర్జున్ ఈ పాత్రలో వున్నప్పుడు మాత్రం తన మైండ్ లో ఆ పాత్ర, స్వభావం, సినిమాలో ఎలా ఉంటుందో అదే ఊహించుకొని, ఎక్కువగా ఎవరితో మాట్లాడకుండా ఒక నిబద్ధతో, అంకిత భావంతో చేశారు అని యూనిట్ సభ్యులు అనుకుంటున్నారు.
అతను అంతలా కష్టపడ్డారు కాబట్టే అతనికి జాతీయ అవార్డు వచ్చింది అని కూడా యూనిట్ సభ్యులు అంటున్నారు. అతని అంకిత భావం చూసి యూనిట్ లో అందరూ ఆశ్చర్యపోతున్నారని తెలిసింది. వినోదంతో కూడిన, వ్యాపారాత్మక సినిమాలు చేసినప్పుడు అందులో నటీనటులు మామూలుగా సెట్ లో మాట్లాడుకుంటూ వుంటారు. కానీ ఇది ఒక ప్రత్యేకమైన సినిమా, ఇందులో పుష్పరాజ్ అనే పాత్ర ఇప్పుడు అల్లు అర్జున్ కెరీర్ లో మైలురాయి అయింది, అందుకని ఆ పాత్ర కోసం అల్లు అర్జున్ ఎంతో కష్టపడుతున్నారు అనే విషయం యూనిట్ సభ్యులు చూసి ఆశ్చర్యపడుతున్నారు.
ఈ పాత్ర కోసం మేకప్ వేసుకోవటం, తీయటం కూడా చాలా కష్టమని చెబుతున్నారు. తెలుగు ప్రేక్షకులతో పాటు, ప్రపంచ సినిమా ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బయట కూడా అందుకే అల్లు అర్జున్ ఎక్కువగా ఎవరితో మాట్లాడకుండా ఆ పాత్ర పూర్తి అయ్యేవరకు తనకు తానే కొన్ని నియమ నిబంధనలను పెట్టుకున్నారు అని తెలిసింది. అంత అంకిత భావం వుంది కాబట్టే అతనికి ఆ సినిమా అంత పేరు తీసుకువచ్చింది అని అంటున్నారు.