మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘ఏజెంట్’ బాటలోనే సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’.. కాకపోతే?

ABN, Publish Date - Feb 15 , 2024 | 01:52 PM

అఖిల్ అక్కినేని నటించిన ‘ఏజెంట్’ తరహాలోనే సందీప్ కిషన్ నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా విడుదలను నిలుపుదల చేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో విశాఖపట్నంకు చెందిన ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) కేసు వేశారు. ఈ కేసు నిమిత్తం నేడు కోర్టులో వాదనలు జరగగా.. కోర్టు ఈ కేసును ఏప్రిల్ 12కు వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. దీంతో థియేట్రికల్ రిలీజ్‌కున్న ప్రాబ్లమ్స్ క్లియర్ అయినట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Ooru Peru Bhairavakona Still

అఖిల్ అక్కినేని నటించిన ‘ఏజెంట్’ (Agent) తరహాలోనే సందీప్ కిషన్ నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) సినిమా విడుదలను నిలుపుదల చేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో విశాఖపట్నంకు చెందిన ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) కేసు వేశారు. అడ్వంచర్స్ ఇంటర్నేషనల్, ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ అధినేతలు అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ తనను నమ్మించి మోసం చేశారని విశాఖపట్నంకు చెందిన ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్, వైజాగ్ ) చెప్పుకొచ్చారు. ఈ విషయంపై ఆయన కోర్టుకు వెళ్లగా.. ఏప్రిల్ 12కు కేసును వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.

బత్తుల సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘ఆ మధ్య వచ్చిన ‘ఏజెంట్’ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు మూడు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలకు ఐదు సంవత్సరాల పాటు నాకు చెందిన గాయత్రి దేవి ఫిలిమ్స్‌కు అందజేస్తామని అగ్రిమెంట్ రాసి ఇచ్చి, నా వద్ద నుంచి 30 కోట్ల రూపాయలు తీసుకుని, అగ్రిమెంట్ ప్రకారం హక్కులు ఇవ్వకుండా వారు నన్ను మోసగించారు. మూడు రాష్ట్రాలకు కాకుండా కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే హక్కులు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తదుపరి సినిమా విడుదలకు ముందు నా డబ్బులు చెల్లిస్తామని, లెటర్ అఫ్ అండర్ టేకింగ్ ఇచ్చి కూడా వారు సమాధానం చెప్పడం లేదు. దాంతో తప్పనిసరి పరిస్థితులలో నేను న్యాయం కోసం కోర్టుకు ఎక్కాను’’ అని చెప్పారు.


తన డబ్బులు ఇచ్చేంతవరకు సినిమా విడుదల కాకుండా స్టే విధించాలని కోరుతూ.. ఈ మేరకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో (OS NO: 658/ 2024) కేసు వేసిన నేపథ్యంలో.. గురువారం ఈ కేసుపై వాదనలు జరిగాయి. ఏప్రిల్ 12కు ఈ కేసును వాయిదా వేశారని, ప్రస్తుతం ‘ఊరు పేరు భైరవకోన’ థియేట్రికల్ రిలీజ్‌కు అడ్డంకులు తొలగినట్లేనని తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయి. టాక్ కూడా పాజిటివ్‌గా ఉంది. అఫీషియల్‌గా ఈ సినిమా ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Ramam Raghavam: ప్రేమికుల రోజు స్పెషల్‌గా ఎమోషనల్ గ్లింప్స్.. సుకుమార్ ఏమన్నారంటే?

***********************

*Tillu Square Trailer: ఈసారి దెబ్బ గట్టిగానే తగిలేటట్టుంది..

*************************

*Sonia Agarwal: నా మాజీ భర్తతో మళ్లీ చేసేందుకు రెడీ..

***************************

Updated Date - Feb 15 , 2024 | 01:52 PM