మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rafah - palestine: రఫాపై దాడి.. ఆ వేదన ఊహకందనిది.. సినీ సెలబ్రిటీల స్పందన

ABN, Publish Date - May 29 , 2024 | 02:32 PM

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, దాడులు జరిగినప్పుడు మొదటిగా స్పందించి మద్దతుగా నిలచే వారిలో సినీ సెలబ్రిటీలు ముందు వరుసలో ఉంటారు.. రఫా నగరంలోని ఒక శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

All Eyes on Rafah

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, దాడులు జరిగినప్పుడు మొదటిగా స్పందించి మద్దతుగా నిలచే వారిలో సినీ సెలబ్రిటీలు ముందు వరుసలో ఉంటారు.. రఫా (Rafah) నగరంలోని ఒక శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పిల్లలు, మహిళలతో కలిపి 45 మంది పాలస్తీనా పౌరులు మృత్యువాత పడ్డారు. ఆ ఘటన దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలిచివేస్తున్నాయి. దీనిపై పలువురు సినీ సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా ఈ దాడిని ఖండిస్తున్నారు. ఈ విషయంపై 'ఆల్‌ ఐస్‌ ఆన్  రఫా’ (All Eyes On Rafah) అనే పదం ట్రెండింగ్‌గా మారింది. మనదేశానికి చెందిన ప్రముఖ నటీనటులు.. ‘ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా’తో ఉన్న ఇమేజ్‌ను తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేసి, కాల్పుల విరమణకు అభ్యర్థించారు. సమంత, త్రిష, మాళవికా మోహనన్‌, రష్మిక, దుల్కర్‌ సల్మాన్‌,  అలియా భట్‌, కరీనాకపూర్‌, ప్రియాంకా చోప్రా, వరుణ్‌ ధావన్‌, సోనాక్షి సిన్హా, పార్వతి తిరువొత్తు, అమీ జాక్సన్‌, దియా మీర్జా, త్రిప్తి డిమ్రి, రిచా చద్దా పాస్తీనా ప్రజలకు తమ సంఘీభావాన్ని తెలిపారు. ‘ఇది ఘర్షణ కాదు..యుద్థం కాదు.. మారణ హోమం’ అంటూ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు.


‘‘ఒక తల్లిగా రఫాలో పిల్లలుని మరీ ముఖ్యంగా అనాథలు అనుభవిస్తున్న వేదన ఊహకందనిది. మన సమాజం నైతిక మార్గాన్ని అనుసరించడం లేదు. మేం కాల్పులు విరమణను డిమాండ్‌ చేస్తున్నాం. మౌనంగా ఉండొద్దు. పాలస్తీనా ప్రజలు అనుభవిస్తున్న బాధ నుంచి మన ప్రభుత్వాలు దృష్టి మరల్చకుండా చూడాలి. అమాయక ప్రజల హత్యల విషయంలో ఎలాంటి సమర్థింపు ఉండదు’’ అని అమీ జాక్సన్‌ తన ఆవేదనను వ్యక్తం చేశారు. గాజాలో కాల్పులు విరమణ పిలుపునిస్తూ ఉన్న ఒక పోస్టును సమంత రీషేర్‌ చేశారు. చిన్నారులందరూ ప్రేమ, రక్షణ, శాంతి, సురక్షిత జీవనానికి అర్హులు అంటూ ఆలియా ఇన్‌స్ట్టాస్టోరీలో రాసుకొచ్చారు. యునిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక.. పాలస్తీనా విషయంలో మౌనంగా ఉండటంపై విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Updated Date - May 29 , 2024 | 04:28 PM