40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Akira Nandan: పవన్ మిస్.. అయితేనేం పండగ వేళ ఆయన వారసుడి లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా!

ABN, Publish Date - Jan 16 , 2024 | 01:53 PM

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మెగా ఫ్యామిలీ సభ్యులందరూ బెంగళూరులో సెలబ్రేషన్స్ జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సెలబ్రేషన్స్ అనంతరం అంతా కలిసి ఒక గ్రూపు ఫొటో తీసుకున్నారు. ఈ గ్రూపు ఫొటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఒక్క పవన్ కళ్యాణ్, ఆయన వైఫ్ మినహా.. మెగా కుటుంబానికి చెందిన అందరూ ఈ గ్రూపు ఫొటోలో ఉన్నారు. ముఖ్యంగా ఇందులో అకీరా లుక్ బాగా హాట్ టాపిక్ అవుతోంది.

Pawan Kalyan with Son and Daughter

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మెగా ఫ్యామిలీ సభ్యులందరూ బెంగళూరులో సెలబ్రేషన్స్ జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సెలబ్రేషన్స్ అనంతరం అంతా కలిసి ఒక గ్రూపు ఫొటో (Mega Family Group Photo) తీసుకున్నారు. ఈ గ్రూపు ఫొటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఒక్క పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆయన వైఫ్ మినహా.. మెగా కుటుంబానికి చెందిన అందరూ ఈ గ్రూపు ఫొటోలో ఉన్నారు. అయితే ఈ ఫొటోలో పవన్ మిస్ అయినప్పటికీ.. ఆయన వారసుడు అకీరా నందన్ (Akira Nandan), వారసురాలు ఆద్య (Aadya) ఉన్నారు. ఈ పండగవేళ అకీరా నందన్ లుక్.. మెగా ఫ్యాన్స్‌ని ఫిదా చేసింది.

గ్రూపు ఫొటోతో పాటు అకీరా, ఆద్య ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ పిక్‌లో సాంప్రదాయ దుస్తుల్లో పవన్ కళ్యాణ్ స్టైల్‌ని ఇమిటేట్ చేస్తున్నట్లుగా అకీరా నిలబడిన తీరు టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అవుతోంది. ఈ ఫొటోలో అకీరాను చూసిన వారంతా.. అరంగేట్రానికి సిన్నోడు సిద్ధమయ్యాడంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. మరికొందరైతే అన్నయ్యా.. వారసుడిని దించు అంటూ పవన్ కళ్యాణ్‌కి రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. మరోవైపు రేణు దేశాయ్ మాత్రం.. అకీరా ఇప్పుడప్పుడే హీరోగా ఎంట్రీ ఇవ్వడని చెబుతున్నారు. తను నటుడిగా పరిచయం అవుతానంటే.. ముందు తనే అందరికీ ఆ విషయం చెబుతానని.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ చెప్పిన విషయం తెలిసిందే. అలాగే ఈ సంక్రాంతి పార్టీలో అకీరా మ్యూజిక్ ప్లే చేస్తున్న వీడియో కూడా ఆయన పేరుని హైలెట్ చేస్తోంది. (Akira Nandan at Mega Sankranthi Celebrations)


ఇక మెగా ఫ్యామిలీ గ్రూప్ పిక్‌లో పవన్ కళ్యాణ్ కనిపించకపోవడంతో కాస్త డిజప్పాయింట్ అయిన ఫ్యాన్స్.. వాళ్లే ఎడిట్ చేసి, అందులో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నట్లుగా పిక్‌లు పోస్ట్ చేస్తున్నారు. మరికొందరేమో.. ఈ గ్రూపు ఫొటోని తీసింది పవన్ కళ్యాణే అనేలా.. పవర్ స్టార్ ఫొటో తీస్తున్నట్లుగా ఎడిట్ చేస్తున్నారు. అకీరా, ఆద్య నిలబడి ఉంటే.. వారి ఎదురుగా పవన్ కళ్యాణ్ కూర్చుని ఉన్నట్లుగా ఫ్యాన్స్ ఎడిట్ చేసిన ఓ పిక్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మొత్తంగా అయితే.. మెగా ఫ్యామిలీ గ్రూప్ ఫొటోతో పాటు.. అకీరా నందన్ లుక్ సంక్రాంతి రోజు సోషల్ మీడియా అటెన్షన్‌ని పొందిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేనే లేదు.


ఇవి కూడా చదవండి:

====================

*Naa Saami Ranga: మొదటి రోజు కంటే రెండో రోజు కిష్టయ్య కుమ్మేశాడు..

**********************

*Mahesh Babu: ‘గుంటూరు కారం’ టీమ్‌కి మహేష్ గ్రాండ్ పార్టీ.. ఫొటోలు వైరల్

************************

*Anasuya: సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో.. అనసూయ చర్యలు ఊహాతీతం

**************************

*K Raghavendra Rao: ‘హనుమాన్’, ‘నా సామిరంగ’ సక్సెస్‌లపై దర్శకేంద్రుడి స్పందన ఇదే..

****************************

Updated Date - Jan 16 , 2024 | 01:53 PM