మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bandla Ganesh: అపోలో ఆస్పత్రిలో చికిత్స.. బండ్ల గణేష్‌కు ఏమైంది?

ABN, Publish Date - Jun 03 , 2024 | 10:07 PM

బండ్ల గణేష్ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. కరోనా టైమ్‌లో రెండు మూడు సార్లు హాస్పిటల్ పాలైన బండ్ల గణేష్ ఈ మధ్య ఆరోగ్యంగానే కనిపించారు. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ విజయానంతరం ఆయన యాక్టివ్‌గానే ఉంటున్నారు. ఆయనకు ఏమైందో ఏమో గానీ.. సడెన్‌గా అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లుగా ఓ వీడియో వైరల్ అవుతోంది.

Bandla Ganesh Hospitalized

బండ్ల గణేష్ (Bandla Ganesh) మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. కరోనా టైమ్‌లో రెండు మూడు సార్లు హాస్పిటల్ పాలైన బండ్ల గణేష్ ఈ మధ్య ఆరోగ్యంగానే కనిపించారు. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections 2024) సమయంలో, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ (Congress Party) విజయానంతరం ఆయన యాక్టివ్‌గానే ఉంటున్నారు. టీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అవుతూ.. ఎవరైనా కాంగ్రెస్ పార్టీపై కామెంట్ చేస్తే కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. ఈ మధ్య ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఏదో పదవి కూడా ఇవ్వబోతుందనేలా వార్తలు వైరల్ అయ్యాయి. మరి ఇలాంటి సమయంలో బండ్ల గణేష్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ కనిపించడంతో ఆయన అభిమానులు, ఫాలోయర్స్ (Bandla Ganesh Fans) కంగారు పడుతున్నారు. అసలు బండ్ల గణేష్‌కు ఏమైంది? అంటూ ఎంక్వైరీ చేసే పనిలో ఉన్నారు.

Also Read- Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌పై పిఠాపురం వర్మ సంచలన వ్యాఖ్యలు


Also Read- Anjali: బాలయ్య నన్ను ఎందుకు నెట్టారో నాకు తెలుసు.. అనవసరంగా పెద్దది చేశారు

అయితే స్వల్ప అనారోగ్యం కారణంగా బండ్ల గణేష్ (Producer Bandla Ganesh) అపోలో హాస్పిటల్‌ (Apollo Hospital)లో చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆయన అనారోగ్యం ఏమిటనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బండ్ల గణేష్ అపోలో హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న వీడియో ఒకటి మాత్రం బాగా వైరల్ అవుతోంది. ఇందులో బండ్ల గణేష్ బెడ్‌పై పడుకుని ఉండగా.. నర్సు ఆయనకి ఇంజెక్షన్ ఇస్తోంది. ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఆయన ఏదో సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లుగానే కనిపిస్తోంది.

Read Latest Cinema News

Updated Date - Jun 03 , 2024 | 10:07 PM