National Film awards: ఉత్తమ హీరో రేసులో ఉన్నది ఎవరంటే!

ABN, Publish Date - Aug 16 , 2024 | 01:53 PM

2022కు సంబంధించిన ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి జాతీయ అవార్డ్స్‌ను అందించనున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం వాస్తవానికి 3 మే 2023న నిర్వహించబడుతుందని అందరూ భావించారు. కరోనా తర్వాత ఈ అవార్డులకు సంబంధించిన షెడ్యూల్స్‌లో మార్పులు వచ్చాయి.

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ప్రకటించనుంది. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి నామినేషన్స అందాయి. 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించనుంది. 2022కు సంబంధించిన ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి జాతీయ అవార్డ్స్‌ను అందించనున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం వాస్తవానికి 3 మే 2023న నిర్వహించబడుతుందని అందరూ భావించారు. కరోనా తర్వాత ఈ అవార్డులకు సంబంధించిన షెడ్యూల్స్‌లో మార్పులు వచ్చాయి.  దీంతో  2022కు సంబంధించిన సినిమాలకు విజేతల జాబితా నేడు విడుదల అవుతుంది. ఇదే ఏడాది అక్టోబర్‌లో  భారత రాష్ట్రపతి చేతులమీదుగా ఈ అవార్డ్స్‌ను విజేతలు అందుకుంటారు. 1 జనవరి 2022 నుంచి 31 డిసెంబర్‌ 2022 మధ్య సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ ద్వారా ధృవీకరించబడిన ఫీచర్‌, నాన్‌-ఫీచర్‌ చిత్రాలు మాత్రమే ఈ అవార్డుల పోటీకి అర్హత పొందాయి. ఉత్తమ నటుడు కేటగిరీలో మలయాళ స్టార్‌ మమ్ముటీ, కన్నడ హీరో, దర్శకుడు రిషబ్‌శెట్టికి అవార్డులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే తెలుగు చిత్రాలకూ పురస్కారాలు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

నేషనల్‌ అవార్డ్‌కు దరఖాస్తు చేసుకున్న తెలుగు సినిమాలివి...
రైటర్‌  పద్మభూషణ్‌,
సీతారామం
అంటే సుందరానికి..
విరాటపర్వం
యశోదౌ
రాధేశ్యామ్‌
సర్కారు వారి పాట
మర్రిచెట్టు
ఖాధిరాం బోస్‌
ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం
కార్తికేయ 2
డిజే టిల్లు
ఇక్షు
ధమాకా
చదువు నీ ఆయుధం
బింబిసారా
భరత పుత్రులు
’లవ్‌
అశోక వనంలో అర్జున కల్యాణం
అల్లూరి 

Updated Date - Aug 16 , 2024 | 03:56 PM