30 Years Prudhvi: ఢిల్లీలో జగన్‌ని ఆ ప్రశ్న అడిగిన విలేఖరిని అభినందించా..

ABN, Publish Date - Jul 24 , 2024 | 10:27 PM

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ మరోసారి వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో వెళ్లి ధర్నా చేస్తున్న జగన్‌ని.. అక్కడి మీడియా బాబాయ్ హత్య జరిగినప్పుడు ఎందుకు ధర్నా చేయలేదంటూ ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి అని పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుందని పృథ్వీ అన్నారు.

Actor Prudhviraj

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ (30 Years Prudhviraj) మరోసారి వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో వెళ్లి ధర్నా చేస్తున్న జగన్‌ (YS Jagan)ని.. అక్కడి మీడియా బాబాయ్ హత్య జరిగినప్పుడు ఎందుకు ధర్నా చేయలేదంటూ ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి అని పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుందని పృథ్వీ అన్నారు. తాజాగా ఆయన హైదరాబాద్‌లో జరిగిన ‘జ్యువెల్ థీఫ్’ మూవీ టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాజకీయాల గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ..

Also Read- Anasuya: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంతో డ్యాన్స్ నెంబర్ చేశా..

‘‘ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు. వర్షం పడుతున్నప్పుడు గొడుగు పెట్టలేదన్న సామెతలాగా ఉంది ఆయన వ్యవహారం. జగన్‌ రాజకీయాలంటే కమర్షియల్ బిజినెస్ అనుకున్నాడు. మళ్లీ అధికారంలోకి వచ్చేస్తానని కలలు కన్నాడు. కానీ ప్రజలు ఛీ కొట్టారు. ప్రజలు ఛీ కొడితే ఎవరైనా దిగిపోవాల్సిందే. వీళ్లేం పెద్ద తోపులు కాదు. జగన్ మళ్లీ వచ్చాడండే రాష్ట్రం రావణకాష్టం అయిపోతుందని ఏపీ ప్రజలు భావించారు. ప్రజల్లో ఎప్పుడైతే భయంకరమైన మార్పు వస్తుందో.. ఆ ప్రభంజనాన్ని ఇక ఎవరు ఆపలేరు. ఆయనకి 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎమ్ టాంపరింగ్‌లు లేవు. అప్పుడు ఆ మాట రాలేదు. ఇప్పుడు మాత్రం ట్యాంపరింగ్ జరిగిందంటున్నారు. (Prudhvi Comments on YS Jagan)


హత్యలు చేస్తున్నారంటూ ధర్నాకు ఢిల్లీకి వెళ్లిన జగన్‌ని ఓ విలేఖరి.. మీ బాబాయ్ హత్య జరిగినప్పుడు ఢిల్లీకి వచ్చి ఎందుకు ధర్నా చేయలేదంటే అతని దగ్గర సమాధానం లేదు. ఆ విలేఖరి నెంబర్ కనుక్కుని నేను హ్యాట్సాఫ్ కూడా చెప్పా. ఆ ప్రశ్నకి జగన్ ఏం మాట్లాడలేదు.. మాటల్లేవ్. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలన అద్భుతంగా జరుగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌గారు అవినీతిపరుల తాట తీస్తున్నారు. కొత్త గవర్నమెంట్‌తో అంతా హ్యాపీగా ఉన్నారు’’ అని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.

Read Latest Cinema News

Updated Date - Jul 24 , 2024 | 10:27 PM