సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Matka Teaser: మనిషి ఆశ చావనంత వరకు.. 

ABN, Publish Date - Oct 05 , 2024 | 06:31 PM

‘విశాఖపట్నం అంటే ఒకటి సముద్రం గుర్తుకు రావాలి లేదా ఈ వాసు గుర్తుకురావాలి’ అంటున్నారు  వరుణ్‌ తేజ్‌.

‘విశాఖపట్నం అంటే ఒకటి సముద్రం గుర్తుకు రావాలి లేదా ఈ వాసు గుర్తుకురావాలి’ అంటున్నారు  వరుణ్‌ తేజ్‌. అయన కథానాయకుడిగా కరుణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మట్కా’ (Matka). మీనాక్షి చౌదరి కథానాయిక. 1958 నుంచి 1982 వరకూ సాగే ఈ  పీరియాడిక్‌ కథలో, వరుణ్‌తేజ్‌ నాలుగు విభిన్నమైన గెటప్ ల్లో   కనిపించనున్నారు.  చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. వైరా ఎంటర్ టైన్మెంట్స్, ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్‌ 14న దీనిని విడుదల చేయనున్నారు. 

ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్రబృందం టీజర్‌ (Matka Teaser) విడుదల చేసింది. ‘విశాఖపట్నం అంటే ఒకటి సముద్రం గుర్తుకురావాలి లేదా ఈ వాసు గుర్తుకురావాలి’, మనకు  ఏది అవసరమై అదే ధర్మం, మనుషుల ఆశ  చావనంత వరకు నా వ్యాపారానికి సావు ఉండదు' అంటూ  వరుణ్‌ తేజ్‌ చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. 

Updated Date - Oct 05 , 2024 | 06:40 PM