Sankranthiki Vasthunam: డైరెక్టర్‌ని టార్చర్ చేసిన వెంకీ మామ..
ABN, Publish Date - Dec 26 , 2024 | 06:26 PM
Sankranthiki Vasthunam: హెడ్డింగ్ చూసి షాక్ అయ్యారా.. మన వెంకీ మామ ఒకరిని టార్చర్ చేయడం ఏంటని. కానీ.. మనందరి వెంకీ మామ సంక్రాంతికి వస్తునాం డైరెక్టర్ 'అనిల్ రావిపూడి'కి చుక్కలు చూపించాడు. హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్ పలువురి ముందు హింసించాడు. ఇంతకు ఏం జరిగిందంటే..
సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న వెంకీ, అనిల్ రావిపూడిల సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' ఇప్పటికే రిలీజైన రెండు పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు మూడో సాంగ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ ఎలక్ట్రిఫైయింగ్ వెంకీ పాడుతున్నట్లు తెలిజేయడానికి టీమ్ చాలా క్రియేటివ్ వీడియోతో ముందుకొచ్చింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.