Maa Nanna Super Hero: ‘వేడుకలో’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Sep 28 , 2024 | 05:45 PM

నవ దళపతి సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో CAM ఎంటర్‌టైన్‌మెంట్, V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇటీవల ఫస్ట్-లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘వేడుకలో’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. జై క్రిష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Updated at - Sep 28 , 2024 | 05:45 PM