Baby John: ‘బేబీ జాన్’ మూవీ ట్రైలర్
ABN, Publish Date - Dec 09 , 2024 | 10:47 PM
మహానటి కీర్తి సురేష్ బాలీవుడ్‌కి పరిచయం అవుతోన్న చిత్రం ‘ బేబీ జాన్’. వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ సమర్పిస్తుండగా.. కాలీస్ దర్శకత్వం వహిస్తున్నా. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ వదిలారు.
వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న బాలీవుడ్ చిత్రం ‘బేబీ జాన్’. ఈ మూవీతో మహానటి కీర్తి సురేష్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వామికా గబ్బీ, జాకీ ష్రాఫ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను తమిళ దర్శకుడు అట్లీ సమర్పిస్తున్నారు.