Suriya44: ‘సూర్య 44’ టైటిల్ ‘రెట్రో’ టైటిల్ టీజర్
ABN, Publish Date - Dec 25 , 2024 | 11:47 AM
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న 44వ చిత్రానికి టైటిల్ ప్రకటిస్తూ.. మేకర్స్ టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.
‘కంగువా’ సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చేస్తున్న చిత్రం ‘సూర్య44’. కార్తీక్ సుబ్బరాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి క్రిస్మస్‌ను పురస్కరించుకుని టైటిల్‌ను ప్రకటించారు. ఈ సినిమాకు ‘రెట్రో’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ని ఫిక్స్ చేస్తూ.. మేకర్స్ టీజర్ కూడా వదిలారు. లవ్, లాఫర్, వార్ అనే నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇందులో సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ టైటిల్ టీజర్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.