Oh Bhama Ayyo Rama: ‘ఓ భామ అయ్యో రామ’ మూవీ టైటిల్ గ్లింప్స్
ABN, Publish Date - Dec 25 , 2024 | 03:47 PM
టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హీరోగా రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ‘ఓ భామ అయ్యో రామ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. మాళవికా మనోజ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
వి ఆర్ట్స్ పతాకంపై సుహాస్, మాళవికా మనోజ్ హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రానికి ‘ఓ భామ అయ్యో రామ’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ.. మేకర్స్ టైటిల్ గ్లింప్స్‌ని విడుదల చేశారు. రామ్ గోదాల దర్శకత్వంలో హరీష్ నల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిత, అలీ, రవీందర్ విజయ్, బబ్లూ పృథ్వీరాజ్, ప్రభాస్ శీను, రఘు కారుమంచి, నయనీ పావని వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటోంది.