Double ismart: ‘డబుల్ ఇస్మార్ట్’లోని ‘స్టెప్పా మార్‌’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jul 02 , 2024 | 04:12 PM

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా టీమ్ ఫస్ట్ సింగిల్ ‘స్టెప్పా మార్‌’ లిరికల్ వీడియోను విడుదల చేసి మ్యూజిక్ ప్రమోషన్స్‌ను మొదలెట్టింది.

Updated at - Jul 02 , 2024 | 04:12 PM