Sankranthiki Vasthunnam: ‘బ్లాక్ బస్టర్ పొంగల్’ లిరికల్ సాంగ్
ABN, Publish Date - Dec 30 , 2024 | 10:02 PM
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సంక్రాంతికి వచ్చేందుకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌ని మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు విడుదల చేసిన మేకర్స్ తాజాగా మూడో సాంగ్ ‘బ్లాక్ బస్టర్ పొంగల్’ లిరికల్‌ను విడుదల చేశారు.
విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ మూవీ నుండి ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్ కావడంతో థర్డ్ సింగిల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సాంగ్ ప్రోమోస్ పాటపై భారీ హైప్‌ని పెంచాయి. ఫైనల్‌గా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫెస్టివ్ బ్యాంగర్ థర్డ్ సింగిల్ ‘బ్లాక్ బస్టర్ పొంగల్’ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.