Sambarala Yeti Gattu Carnage: 'సంబరాల ఏటి గట్టు'లో మారణ హోమం.. సాయి దుర్గా తేజ్

ABN, Publish Date - Dec 12 , 2024 | 09:20 PM

మెగా హీరో సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej) ‘విరూపాక్ష’ లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత, తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18 చేస్తున్నారు. డెబ్యుటెంట్ రోహిత్ కెపి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘హనుమాన్’ సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌తో పాటు 'సంబరాల ఏటి గట్టు' మారణ హోమం (Sambarala Yeti Gattu Carnage) వీడియోని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

Updated at - Dec 12 , 2024 | 09:20 PM