RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ ట్రైలర్
ABN, Publish Date - Dec 17 , 2024 | 07:10 PM
భారతీయ సినిమా సత్తాని ఆస్కార్ వేదికపై చాటిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి, రామ్ చరణ్, రామారావుల కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి ‘ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ పేరుతో ఓ డాక్యుమెంటరీని మేకర్స్ విడుదల చేయబోతున్నారు.
భారతీయ సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). దర్శకధీరుడు రాజమౌళి (SS Raja Mouli) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆస్కార్‌తో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. తారక్, రామ్ చరణ్ హీరోలుగా డి.వి.వి దానయ్య నిర్మించిన ఈ చిత్రం 2022లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడు ఈ టీమ్ ప్రేక్షకులకు ఒక సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాపై డాక్యుమెంటరీ సిద్ధం చేసి విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించింది. ‘ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ పేరుతో రానున్న ఈ డాక్యుమెంటరీ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. డిసెంబర్ 20న ఈ డాక్యుమెంటరీ విడుదలకానుంది.
Updated at - Dec 17 , 2024 | 07:10 PM