సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Karavali: భయపెడుతోన్న ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ టీజర్

ABN, Publish Date - Dec 31 , 2024 | 10:18 PM

ప్రస్తుతం ఆడియెన్స్‌ను ఆకట్టుకోవాలంటే రెగ్యులర్ రొటీన్ చిత్రాలు కాకుండా కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయాలి. ఇది వరకు చూడనటువంటి కంటెంట్‌ను, కాన్సెప్ట్‌ను చూపిస్తేనే ఆడియెన్స్ థియేటర్‌ వరకు వస్తున్నారు. ఈ క్రమంలో కన్నడలో డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ అంటూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ వదిలారు.

డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా.. ‘అంబి నింగే వయసైతో’తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గురుదత్త గనిగ తాజాగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కరావళి’. వీకే ఫిల్మ్స్ బ్యానర్‌తో కలిసి గురుదత్త గనిగ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై గురుదత్త గనిగ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ప్రోమో ఆడియెన్స్‌ నుండి మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ గూస్ బంప్స్ తెప్పించే టీజర్‌ను వదిలారు.

Also Read-Dil Raju: సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై కేటీఆర్ కామెంట్స్‌కు దిల్ రాజు స్పందనిదే..

‘పిశాచి రాక’ అంటూ వదిలిన ఈ టీజర్‌లోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, ఆర్ఆర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉండటమే కాకుండా భయపెట్టేస్తున్నాయి. ఈ టీజర్ చూస్తుంటే కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రం రాబోతోందనేది అర్థమవుతోంది. మహిషాలకు, మానవులకు మధ్య జరిగే కాన్సెప్ట్‌‌తో ఈ సినిమా తెరకెక్కుతుందనే విషయాన్ని ఈ టీజర్‌ తెలియజేస్తుంది. ఈ చిత్రానికి సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. అభిమన్యు సదానందన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. 2025లో ఈ చిత్రం థియేటర్లోకి రానుంది.


Aslo Read-Game Changer: డిప్యూటీ సీఎం డేట్ ఇస్తే.. హిస్టరీ రిపీట్ అవుద్ది..

Also Read-Yearender 2024 ఆర్టికల్స్..

Also Read-Devi Sri Prasad: 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్' వెనుక ఏం జరిగిందంటే..

Also Read-Tollywood: అల్లు అర్జున్ ఎఫెక్ట్.. ‘మా’ మంచు విష్ణు అలెర్ట్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 31 , 2024 | 10:18 PM