Akkada Ammayi Ikkada Abbayi: ప్రదీప్‌ని టచ్‌లో ఉండమంటున్న బ్యూటీ
ABN, Publish Date - Dec 25 , 2024 | 04:36 PM
Akkada Ammayi Ikkada Abbayi: యాంకర్ టర్న్‌డ్ హీరో ప్రదీప్ మాచిరాజుని ఓ బ్యూటీ టచ్ లో ఉండమంటుంది. శీతాకాలం కాబట్టి తన మాస్ స్టెప్పులు వేసి మరి దగ్గరకి రమ్మంటుంది. ఇంతకీ ఆ వ్యవహారం ఏంటో తెలియాలంటే.. మీరు ఈ వీడియో చూడాలసిందే.
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన పాపులర్ యాంకర్ టర్న్‌డ్ హీరో ప్రదీప్ మాచిరాజు తన రెండవ సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో అలరించబోతున్నారు. ఈ సినిమాకు నితిన్, భరత్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పిల్లి ప్రదీప్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం నుండి తాజాగా 'టచ్‌లో ఉండు మీ శీతాకాలం సరోజ' లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ లో ప్రదీప్ సరసన చంద్రిక రవి స్టెప్పులు వేసింది. రధన్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది.
Updated at - Dec 25 , 2024 | 04:36 PM