Robinhood: ‘వన్ మోర్ టైమ్’ అంటూ వచ్చేసిన నితిన్, శ్రీలీల
ABN, Publish Date - Nov 26 , 2024 | 06:48 PM
హీరో నితిన్ మచ్-అవైటెడ్ హీస్ట్ కామెడీ చిత్రం ‘రాబిన్‌హుడ్’. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ మొదలయ్యాయి. ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. మంగళవారం ఫస్ట్ సింగిల్ ‘వన్ మోర్ టైమ్’ని వదిలారు మేకర్స్.