Anaganaga Oka Raju: 'నవీన్ పోలిశెట్టి' పెళ్ళికి సర్వం సిద్ధం
ABN, Publish Date - Dec 25 , 2024 | 04:11 PM
Anaganaga Oka Raju: "ప్రేక్షకులంతా కడుపుబ్బా నవ్వుకోవడానికి సిద్ధంకండి. మేము వినోదాన్ని పంచడానికి సిద్థమవుతున్నాము’’ అంటున్నాడు జాతి రత్నం 'నవీన్ పోలిశెట్టి'
నవీన్ పోలిశెట్టి హీరోగా ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఒకరాజు’. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 2022లో రాజుగాడి పెళ్లి పేరుతో టీజర్ రిలీజ్ చేసిన మూవీ తర్వాత ఏమైందో ఎవరికీ తెలీదు. తాజాగా ఈ సినిమా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. డిసెంబర్ 26న ప్రీ వెడ్డింగ్ టీజర్ ని రిలీజ్ చేయనున్నట్లు ఓ వీడియోని రిలీజ్. ఈ సినిమాలో సెన్సేషనల్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించనుంది.
Updated at - Dec 25 , 2024 | 04:11 PM