Bachhala Malli Lyrical Song: 'మా ఊరి జాతరలో' పాట వచ్చేసింది

ABN, Publish Date - Jul 16 , 2024 | 12:34 PM

నరేష్, అమృత అయ్యర్ జంటగా నటించిన 'బచ్చలమల్లి' సినిమా నుండి 'మా ఊరి జాతరలో...' అనే పాట చరణాలు విడుదల చేశారు ఈరోజు. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి రాజేష్ దందా, బాలాజీ గుప్తలు నిర్మాతలు. నరేష్ కెరీర్ లో ఈ 'బచ్చలమల్లి' సినిమా ఒక మంచి సినిమా అవుతుందని ఆ చిత్ర నిర్వాహకులు అనుకుంటున్నారు. ఈమధ్యనే విడుదలైన ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, ఈ సినిమాలో నరేష్ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది అని చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో వున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు, ఈ పాటని శ్రీమణి రచించగా, గౌర హరి, సింధూరి విశాల్ పాడారు

Updated at - Jul 16 , 2024 | 12:34 PM