Pushpa 2 The Rule: ‘కిస్సిక్’ ఫుల్ వీడియో సాంగ్
ABN, Publish Date - Dec 19 , 2024 | 07:52 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప 2’ సినిమాలోని ‘కిస్సిక్’ ఫుల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘పుష్ప 2’. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీల ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ‘కిస్సిక్’ అంటూ సాగిన ఈ పాట.. ట్రెండ్ సెట్టర్‌గా నిలవగా.. తాజాగా మేకర్స్ ‘కిస్సిక్’ ఫుల్ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచారు.