Alanaati Ramachandrudu: కనులార లిరికల్ వీడియో సాంగ్

ABN, Publish Date - Mar 05 , 2024 | 07:41 PM

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స్ బ్యానర్‌పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. మోక్ష హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ కనులార అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు.