Game Changer: దిల్ రాజు కోసం స్పెషల్ సాంగ్..
ABN, Publish Date - Dec 18 , 2024 | 06:43 PM
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీ నుండి ఫోర్త్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. ఈరోజు నిర్మాత దిల్ రాజు సందర్భంగా ఫోర్త్ సాంగ్ 'ధోప్' ప్రోమోని రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్‌ని డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు.
Updated at - Dec 18 , 2024 | 06:47 PM