Daaku Maharaaj: ది రేజ్ ఆఫ్ డాకు.. ఫస్ట్ లిరికల్ వీడియో
ABN, Publish Date - Dec 14 , 2024 | 07:06 PM
తన నటవిశ్వరూపంతో ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న బాలకృష్ణ, మరో అద్భుతమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న భారీ చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.
Updated at - Dec 14 , 2024 | 07:06 PM