సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Thandel first song: 'బుజ్జి తల్లి' లిరికల్ వీడియో

ABN, Publish Date - Nov 21 , 2024 | 07:39 PM

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా 'తండేల్' మ్యూజికల్ ప్రమోషన్లు  గురువారం నుంచి  ప్రారంభమయ్యాయి.  ఫస్ట్ సింగిల్-బుజ్జి తల్లి లిరికల్ వీడియోను విడుదల చేశారు.  చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీలోని ఈ సాంగ్ లీడ్ పెయిర్ ఎమోషనల్ జర్నీని అందంగా ప్రజెంట్ చేసింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ మ్యాజికల్ గా వుంది.  బాధలో ఉన్న ప్రియురాలిని ఓదార్చడానికి హీరో    ప్రయత్నిస్తున్నప్పుడు కథలో కీలకమైన సమయంలో ఈ సాంగ్ వస్తుంది. లిరికల్ వీడియో ద్వారా లీడ్ పెయిర్ బాండింగ్ అద్భుతంగా చూపించారు. శ్రీమణి రాసిన లిరిక్స్, జావేద్ అలీ సోల్ ఫుల్ వోకల్స్ ట్రాక్‌ కు మరింత డెప్త్ ని యాడ్ చేశాయి. అల్లు అరవింద్ సమర్పణలో  గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన యధార్ద సంఘటనల స్ఫూర్తితో రూపొందింది.   ఈ మూవీకి షామ్‌దత్ డీవోపీగా పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్. ఆర్ట్ విభాగానికి శ్రీనాగేంద్ర తంగాల నేతృత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 7న సినిమా  విడుదల కానుంది.

Updated Date - Nov 21 , 2024 | 07:39 PM