Sankranthiki Vasthunam: వింటేజ్ రమణ గోగుల ఈజ్ బ్యాక్.. ‘గోదారి గట్టు’

ABN, Publish Date - Nov 30 , 2024 | 04:46 PM

విక్టరీ వెంకటేష్ ఎక్స్-కాప్‌గా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ హోల్సమ్ ఎంటర్ టైనర్ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఫస్ట్ సింగిల్ ‘గోదారి గట్టు’ను డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. రమణ గోగుల పాడిన ఈ పాట ఆయన కమ్ బ్యాక్‌ని తెలియజేస్తోంది. ఈ బ్రీజీ రొమాంటిక్ మెలోడీకి భాస్కరభట్ల లిరిక్స్ రాశారు. తాజాగా ఈ సాంగ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. మీరు ఓ లుక్ వేయండి.

Updated at - Nov 30 , 2024 | 04:46 PM