Coolie: సెట్‌లో సందడి.. రజనీ స్టెప్పులు అదరహో

ABN, Publish Date - Sep 15 , 2024 | 07:49 PM

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) 'కూలీ' (Coolie) సెట్‌లో సందడి చేశారు. ఓనం పండుగను పురస్కరించుకున్న చిత్ర బృందం సెట్‌లో సెలబ్రేషన్స్‌ చేసింది.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) 'కూలీ' (Coolie) సెట్‌లో సందడి చేశారు. ఓనం పండుగను పురస్కరించుకున్న చిత్ర బృందం సెట్‌లో సెలబ్రేషన్స్‌ చేసింది. ఈ సందర్భంగా రజనీకాంత్‌ తనదైన శైలిలో స్టెప్పులు వేసి అలరించారు. దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ని (lokesh Kanagaraj)కూడా కాలు కదపాలని కోరగా ఆయన మొహమాటపడుతూ వెనక్కి జరిగారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. శ్రుతీహాసన్‌, నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కలానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు. 

Updated Date - Sep 15 , 2024 | 08:22 PM