Godari Gattu Song: 18 ఏళ్ళ తర్వాత వెంకటేష్ కోసం..
ABN, Publish Date - Dec 03 , 2024 | 01:03 PM
‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) చిత్రంతో ఈ సంక్రాంతికి వినోదాలు పంచనున్నారు విక్టరీ వెంకటేశ్ (Venkatesh). ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) నాయకానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘గోదారి గట్టుమీద రామ చిలకవే..’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. 'లక్ష్మి' చిత్రం వచ్చిన 18 ఏళ్ల తర్వాత రమణగోగుల వెంకటేష్ కోసం ఈ పాట పాడారు. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చగా.. భాస్కరభట్ల సాహిత్యం అందించారు.
Updated at - Dec 03 , 2024 | 01:03 PM