సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు.. వీడియో చూశారా
ABN, Publish Date - Dec 26 , 2024 | 12:37 PM
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను తెలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు గురువారం భేటీ అయ్యారు. ఈ భేటీకి టాలీవుడ్ నుండి దాదాపు 36 మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. సీఎంతో భేటీకి టాలీవుడ్ తరపున వచ్చిన సినీ ప్రముఖులు ఎవరెవరంటే..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అనంతరం టాలీవుడ్‌లో ప్రక్షాళన మొదలైంది. టాలీవుడ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు, అలాగే టాలీవుడ్‌పై ప్రభుత్వ స్టాండ్ ఏంటనేది తెలిపేందుకు అటు సినిమా ఇండస్ట్రీ, ఇటు ప్రభుత్వం ఒక్క తాటిమీదకు వచ్చి చర్చలు చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నూతన ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఇండస్ట్రీ తరుపు నుండి ఎవరెవరు హాజరయ్యారో పై వీడియోలో మీరు చూడవచ్చు.