Chiranjeevi: సీఎంతో సమావేశానికి చిరు అందుకే రాలేదా?
ABN, Publish Date - Dec 26 , 2024 | 02:15 PM
తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రస్తుతం పెద్ద దిక్కుగా చెప్పుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి.. గురువారం సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సినీ ప్రముఖుల భేటీకి రాకపోవడంపై అనేకానేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి రాకపోవడానికి కారణం ఇదేనని తెలుస్తోంది. ఇంతకీ చిరు ఎందుకు ఈ సమావేశానికి రాలేదంటే..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గురువారం టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి హీరోలు నాగార్జున, వెంకటేశ్, నితిన్, కిరణ్ అబ్బవరం, సిద్దు జొన్నలగడ్డ వంటి వారంతా హాజరయ్యారు కానీ.. సినీ ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా మారిన మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. దీంతో ఆయన ఎందుకు రాలేదని అంతా అనుకుంటూ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పర్సనల్ రీజన్ ఏమీ లేదు కానీ.. ప్రస్తుతం ఆయన సిటీలో లేరని తెలుస్తుంది. అసలు విషయం ఏమిటనేది.. పై వీడియోలో చూడండి. అయితే మెగాస్టార్ రాకపోయినా సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన మీటింగ్‌కు సంబంధించిన విశేషాలను ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారని తెలిసింది.